నిజామాబాద్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 12 కొత్త బార్లకు గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా భీమ్గల్ ఒక బారుకు మాత్రమే డ్రా తీసిన విషయం తెలిసిందే. కాగా డ్రా వాయిదాపడిన మిగతా 11 బార్లకు తిరిగి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నోటిఫై చేయబడిన బార్ల వివరాలు
1.నిజామాబాద్ కార్పొరేషన్ 7
2.ఆర్మూరుమున్సిపాలిటీ 1
3.బోధన్ మున్సిపాలిటీ 3 బార్లు.
దరఖాస్తులు దాఖలు చేయటానికి చివరి తేదీ 06.03 .2021
డ్రా తేదీ 08 .03 .2021 ప్రగతిభవన్, కలెక్టరేట్ నిజామాబాద్ యందు.
దరఖాస్తు దారుడు (3) పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదాపాన్ కార్డు మరియు ఒక లక్ష రూపాయలు దరఖాస్తు రుసుం చెల్లించాలన్నారు.
దరఖాస్తులు స్వీకరించు ప్రదేశం
1.డిస్ట్రిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, నిజామాబాద్.
2. డిప్యూటి కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, నిజామాబాద్ డివిజన్.
3. కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, హైదరాబాద్.
దరఖాస్తు చేయడానికి ఎలాంటి జిఎస్టి రిజిస్ట్రేషన్ అండ్ ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021