నిజామాబాద్, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అధికారుల సంక్షేమం కొరకు జిల్లా అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. ఇందు కొరకు సంఘం రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేయగా ధ్రువ పత్రం జారీ చేశారని వారు తెలిపారు.
సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు. జిల్లా అధికారుల సంఘంలో అధ్యక్షులుగా మెప్మా పిడి రాములు, ఉపాధ్యక్షులుగా జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జనరల్ సెక్రెటరీగా జిల్లా సహకార అధికారి సింహాచలం ఇతర అధికారులు సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021