నిజామాబాద్, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి, 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు గల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తన మాతృ మూర్తికి వ్యాక్సిన్ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1 నుండి జిల్లాలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్, 2 ప్రైవేటు హాస్పిటల్స్ ప్రగతి, మెడికవర్ హాస్పిటల్లో ప్రారంభించు కోవడం జరిగిందన్నారు.
వారం రోజులో జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. రోజు ఉదయం 10 గంటల నుండి నాలుగు గంటల వరకు వ్యాక్సినేషన్ ఇస్తూ రోజు ఒక్కొక్క సెంటర్లో 200 మందికి వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చునని ఏ రోజు ఖాళీగా ఉన్న బుక్ చేసుకోని వ్యాక్సిన్ కేంద్రానికి రావచ్చు అన్నారు. పోర్టల్ ఖాళీగా ఉంటే మూడు గంటల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
జిజిహెచ్‌లో మాత్రం డైరెక్టుగా కూడా రావచ్చని, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ప్రైవేట్‌లో అటువంటి సదుపాయం లేదన్నారు. రెండు రకాల వ్యాక్సిన్ వాడుతున్నామని, ఇప్పుడు ఏ వ్యాక్సిన్ ఇస్తాము రెండో రోజూ అదే వ్యాక్సిన్ ఇస్తామన్నారు. జిజిహెచ్‌లో తీసుకునేవారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నామని, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకునేవారికి 250 రూపాయల వరకు ఛార్జి ఉంటుందని కలెక్టర్ అన్నారు.
ఎక్కడివారైనా సరే వారు కూడా తీసుకోవచ్చు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకువచ్చి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనారు. ప్రభుత్వం అందరికోసం తమ అందరి మంచి కోసం కరొన వైరస్ ఎదుర్కోవాలంటే అందరూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులోనూ రిస్కు పీపుల్స్ 60 సంవత్సరాలు దాటిన వారు, 45 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. సోమవారం చాలామంది వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చారని వ్యాక్సిన్ వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
అందరూ నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన సీనియర్ సిటిజన్స్‌తో మాట్లాడుతూ జిజిహెచ్‌లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు, ఎవరికీ ఇబ్బంది వచ్చినా వెంటనే హ్యాండిల్ చేస్తామన్నారు. అందుకు డాక్టర్లు రెడీగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్‌వో సుదర్శనం, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్ సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021