Breaking News

పెండింగ్‌ ఈ-చలాన్ ల‌‌‌ను చెల్లించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వాహానాదారుల‌కు పోలీసు ఈ-చలానా ద్వారా విధించిన జరిమానాలు బకాయిలు ఉన్న వాహనదారులు తక్షణమే ఆన్‌ లైన్‌ ద్వారా లేదా మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాల‌ ద్వారా చెల్లించాల‌ని కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌ కమీషనరేటు పరిధిలో ట్రాఫిక్‌ నియంత్రణ మరియు నియమావళి ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు పోలీసులు విధించిన ఈ-చలాన్‌ బకాయిలు ఉన్న వాహనాల‌పై పోలీసులు దృష్టి పెట్టి వారితో పెండింగ్‌ ఈ-చలాన్‌లు కట్టించాల‌ని పోలీస్‌ కమీషనర్‌ ఆదేశించారు.

ఇందులో భాగంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటులో గల‌ 33 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ ముమ్మరంగా తనిఖీలు (స్పెషల్‌ డ్రైవ్‌) నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాదారుల‌కు ఈ-చలాన్‌ ద్వారా జరిమానాలు విధించడంతో పాటు అదే సమయంలో గతంలో వాహనాదారుల‌కు సంబంధించిన బకాయిల‌ను పరిశీలించడంతో పాటు మూడు అంతకు మించి ఈ-చలానా జరిమానాలు పెండింగ్‌లో ఉన్న వాహనాల‌ను పోలీసులు తాత్కాలికంగా సీజ్‌ చేయమని పోలీస్‌ కమీషనర్‌ ఆదేశించారు.

వాహానాల‌ పై గల‌ పెండింగ్‌ ఈ-చలానా జరిమానాలు ఆన్‌లైన్‌ గాని, మీ సేవా ద్వారా గాని చెల్లించిన అనంతరం వావానాల‌ను వాహానాదారునికి తిరిగి అందచేయడం జరుగుతుందని, వాహనాదారుడు వాహనానికి సంబంధించిన జరిమానాల‌ను వెబ్‌ సైట్‌ ద్వారా తమ వాహనాల‌ పై గల‌ ఈ-చలానా జరిమానా పెండింగ్‌ వివరాల‌ను తెలుసుకొని సమీప మీ-సేవా కేంద్రం నుండి ఆన్‌లైన్‌ ద్వారా గాని చెల్లించుకోవచ్చని తెలిపారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు వరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్లు మరియు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ-చలాన్‌ పెండింగ్‌లో గల‌ కేసుల‌కు‌ సంబంధించి వారు త్వరిత గతిన పెండింగ్‌ను చెల్లించాల‌న్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article