Breaking News

అధికారులు పనులు పూర్తయ్యేలా చూడాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనులు పూర్తి చేయించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ ప్రజల‌కు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనందున 60 సంవత్సరాలు దాటిన వారు 45 సంవత్సరాలు దాటి ఎంపిక చేయబడిన వ్యాధుల‌తో బాధపడుతున్నవారు వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు.

ఉద్యోగులు వారి ఇంట్లో 60 సంవత్సరాలు పై బడిన వారుంటే వ్యాక్సిన్‌ వేయించాల‌ని, మెడికల్‌ ఆఫీసర్‌ు వాక్సిన్‌ కొరకు వచ్చిన వారిని పరిశీలించి వెంటనే సర్టిఫికెట్‌ ఇవ్వాల‌ని తెలిపారు. మొదటి డోస్‌ వేసుకున్న వారు రెండవది వేసుకునేవిధంగా చర్యలు తీసుకోవాల‌ని డిఎం అండ్‌ హెచ్‌వోను ఆదేశించారు. జిల్లా అధికారులు వారంలో మూడు రోజులు ఫీల్డ్‌లో తిరగాల‌ని అప్పుడే పనులు సకాలంలో పూర్తవుతాయని జిల్లా అధికారుల‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

హరిత హారంలో నాటిన మొక్కలు జిల్లా అధికారులు ఫీల్డ్‌కు వెళ్లిన ప్రతి సారి పరిశీలించాల‌ని ప్రత్యేకంగా నాటిన మొక్కల‌న్నీ ఎండిపోకుండా ప్రతిరోజు ఉపాధి హామీ పథకంలో నీటిని అందించాల‌ని జిల్లా అధికారుల‌ను మరియు డిఆర్‌డిఓ అధికారుల‌ను, ఎంపీడీవో ల‌ను ఆదేశించారు. పాఠశాల‌ల్లో 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు 42 శాతం, 9వతరగతి నుండి 10వ తరగతి వరకు 75 శాతం విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు.

సంక్షేమ శాఖలోని విద్యా సంస్థల‌లో కూడా విద్యార్థులు హాజరు శాతం బాగానే ఉన్నదని పేర్కొన్నారు. అయితే అన్ని పాఠశాల‌ల్లో కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల‌ని అన్ని విద్యాసంస్థల‌ అధికారుల‌ను ప్రత్యేకంగా ఆదేశించారు. వసతి గృహాల్లో తాగునీరు ఇతర సౌకర్యాల‌ సమస్యలు లేకుండా చూడాల‌న్నారు. మరోవైపు అన్ని శాఖలు వారి ఆధ్వర్యంలో చేపట్టిన పనుల‌న్నీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని తెలిపారు. యాసంగి పంటకు యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చూడాల‌ని తెలిపారు.

ఎండాకాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున నీటి వాడకం పెరుగుతుందని అవసరాల‌కనుగుణంగా త్రాగు నీటిని సరఫరా చేయడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని మున్సిపల్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుల‌కు ఆదేశించారు. సిడిఎఫ్‌, ఎస్‌డిఎఫ్‌, ఎంపీ లాడ్స్‌ లాంటి ప్రత్యేక నిధుల‌తో చేపట్టి కొనసాగుతున్న పనుల‌న్నీ మే చివరికల్లా పూర్తి చేయాల‌ని, మున్సిపాలిటీల‌లో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాల‌ని మంజూరు కాబడి ఇంకా ప్రారంభం కాకుండా ఉంటే వెంటనే ప్రారంభించాల‌ని, పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల‌ని కమిషనర్లను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, వీఐపీలు, విఐపిల‌ను ఆహ్వానించడంలో ప్రభుత్వ నిబంధనల‌ ప్రకారం ప్రోటోకాల్‌ పాటించాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిఏవో గోవిందు, జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌ నాయక్‌, డిపిఓ జయసుధ, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఆర్‌డివోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article