Breaking News

గాంధారిలో వాటర్‌ ప్లాంట్లు ప్రారంభం

గాంధారి, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని వివిధ గ్రామాల‌లో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను సోమవారం ప్రారంభించారు. సఫ ఆర్గానిక్‌ లిమిటెడ్‌ అధినేత, శాస్త్రవేత్త అయిన పైడి ఎల్లారెడ్డి తన సొంత ఖర్చుల‌తో మండలంలోని మేడిపల్లి, సితాయిపల్లి, పెట్‌ సంగేమ్‌, నర్సాపూర్‌ గ్రామాల‌లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా అయన ఆయా గ్రామాల‌ ప్రజాప్రతినిధుల‌తో కలిసి వాటిని ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల‌కు మినరల్‌ వాటర్‌ అందించాల‌నే ఉద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని మరిన్ని గ్రామాల‌లో కూడా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్బంగా పైడి ఎల్లారెడ్డికి ఆయా గ్రామాల‌ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మనోహర్‌ రెడ్డి, ముకుంద్‌ రావు, అంజాద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాతు సంగెంలో కుస్తీ పోటీలు

గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ...

Comment on the article