Breaking News

గర్భిణీకి రక్తదానం

కామరెడ్డి, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఎల్లారెడ్డి ప్రభుత్వ వైద్యశాల‌లో సుజాత (28) గర్భిణీకి ఆపరేషన్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు 62 వ సారి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల‌ నుండి రక్తదానం చేస్తున్నానని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించడం కోసం రక్తదాతల‌ సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడ గలుగుతున్నామన్నారు. కరోణ సమయంలో కూడా 50 యూనిట్ల ప్లాస్మాను, 368 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు.

సమూహం ద్వారా ఇప్పటి వరకు 5 వేల‌ 500 కు పైగా యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలల‌కోసారి రక్తదానం చేయవచ్చునని, రక్తదానం ప్రాణదానంతో సమానమే అన్నారు. కార్యక్రమంలో రజని, టెక్నీషియన్‌ చందన్‌ తదితరులున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article