Breaking News

Daily Archives: March 3, 2021

పంచాయతీ కార్యదర్శికి చార్జి మెమో

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంపోస్టు షెడ్డు నిర్వహణలో అల‌సత్వం వహించినందున పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఉపాధి హామీ ఏపీవో రజినిల‌కు ఛార్జి మెమోలు జారీ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. దోమకొండ మండల‌ కేంద్రంలోని కంపోస్టు షెడ్డును బుధవారం ఆయన పరిశీలించారు. షెడ్డులో తడి పొడి చెత్తను వేరు చేయడంలో జాప్యం చేస్తున్నందుకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మండల‌ కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామంను పరిశీలించారు. వైకుంఠధామం చుట్టూ మొక్కలు ...

Read More »

వినికిడి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 3 వ తేదీ బుధవారం ప్రపంచ వినికిడి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల‌ చేసిన పోస్టర్‌ను తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినికిడి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాల‌ని, స్త్రీలు గర్భిణీ సమయంలో డాక్టర్ల సల‌హాలు లేకుండా మందులు వాడడం వల‌న పుట్టే బిడ్డలు వినికిడి లోపంతో జన్మించే అవకాశం ఉందని, డాక్టర్ సల‌హా ప్రకారం మందులు తీసుకోవాల‌ని, అలాగే ...

Read More »

నీటిపారుదల‌ శాఖల‌ భూములు, ట్యాంకుల‌ వివరాలు నమోదు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిపారుదల‌ శాఖ మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకు వివరాల‌ను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం నీటిపారుదల‌ శాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకు వివరాల‌ను పూర్తి నీటి మట్టం వరకు సేకరించి ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల‌ని తెలిపారు. అదేవిధంగా నీటిపారుదల‌ శాఖకు సంబంధించిన ఖాళీగా ఉన్న భూముల‌ వివరాల‌ను సర్వే చేసి మూడు రోజుల‌లోగా అందించాల‌ని ...

Read More »

ఆర్మూర్‌లో బీడీ కార్మికుల‌ భారీ సభ

ఆర్మూర్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ పరిశ్రమను నాశనం చేసే కాట్పా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల‌ని తెలంగాణ ప్రగతిశీల‌ బీడీవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బీ.సూర్య శివాజీ అన్నారు. ఆయన అధ్యక్షతన ఆర్మూర్‌ రామ్‌ నగర్‌లో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల‌ కృష్ణ, సహాయ కార్యదర్శి ముత్తన్న, ఐఎఫ్‌టియు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, బీడీ కమిషన్‌ దారుల‌ సంఘం ...

Read More »

గ్రామస్తులు ఏకతాటిపై ఉంటే యంత్రాంగం సహకరిస్తుంది

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ ప్రజలు ఏకతాటిపై ఉంటే ప్రభుత్వం మీ వెనకాల‌ ఉంటుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి నవీపేట మండలం కమలాపూర్‌ గ్రామంలో అంకాల‌మ్మ, పోలేరమ్మ ఆయా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ దేవతల‌ను గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేసుకుంటే గ్రామానికి ఎటువంటి కష్టం ఉండదనే సంక‌ల్పంతోనే అందరూ దేవాల‌యాల‌ను నిర్మించుకుంటారన్నారు. కమలాపూర్‌ గ్రామస్తులు యూనిట్‌గా గ్రామ అభివృద్ధి చేసుకోవాల‌ని మీరడిగిన ...

Read More »

హెడ్మాస్టర్‌ సస్పెండ్‌

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ ఎల్‌.డీప్లా లైంగిక వేధింపుల‌పై పలు యూనియన్‌లు దరఖాస్తు అందించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అతనిని సస్పెండ్‌ చేశారు. ఎంక్వైరీ ఆఫీసరుగా ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి, బాన్సువాడ రెవిన్యూ డివిజనల్‌ అధికారి రాజా గౌడ్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Read More »

జగిత్యాల‌లో నెదర్లాండ్‌ (డచ్‌) విలేఖరి

జగిత్యా, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెదర్లాండ్స్‌ (డచ్‌) కు చెందిన ‘డచ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ ఫౌండేషన్‌’ – ఎన్‌ఓఎస్‌ (టివి, రేడియో, ప్రింట్‌) అనే వార్తా సంస్థ దక్షిణ ఆసియా ఢిల్లీ విలేఖరి అలెట్టా ఆండ్రే తన కెమెరా పర్సన్‌తో పాటు బుధవారం జగిత్యాల‌ జిల్లాలో పర్యటించారు. ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల గైడ్‌ గా, అనువాదకులుగా వ్యవహరించారు. ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌, ఖతార్‌ ప్రతినిధి తోట ధర్మేందర్‌ గల్ఫ్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల‌ను ...

Read More »

4 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లో గల‌ డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సుల‌కు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూల‌ర్‌ మరియు ప్రాక్టికల్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షల‌కు ఎటువంటి ఆల‌స్య రుసుము లేకుండా ఈ నెల‌ 4 వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించారు. పరీక్షలు మార్చి 2021 లో జరుగనున్నాయి. 100 రూపాయల ఆల‌స్య రుసుముతో ఈ నెల‌ 6 వరకు, 500 ...

Read More »

టీయూ ఫాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌గా ఆచార్య అరుణ

డిచ్‌పల్లి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ఫాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌గా ఆచార్య అరుణ నియమితుల‌య్యారు. ఉపకుల‌పతి, సీనియర్‌ ఐఎఎస్‌ నీతూ కుమారి ప్రసాద్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియామక ఉత్తర్వుల‌ను బుధవారం ఆచార్య అరుణకు అందించారు. కాగా ఇప్పటి వరకు ఫాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ గా ఆచార్య నసీం కొనసాగారు. ఆచార్య అరుణ ప్రస్తుతం బి.ఎడ్‌. కళాశాల‌ సారంగపూర్‌ ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు ఐక్యూఎసీ డైరెక్టర్‌గా, విశ్వవిద్యాల‌య కళాశాల‌ వైస్‌ – ప్రిన్సిపల్‌గా, ...

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్‌లో మంచి ర్యాంకు సాధించాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్‌ పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల‌కు ప్రతీ ఒక్కరు సహకరించి పట్టణ ప్రగతికి సహకరించాల‌ని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ వినీత పండిట్‌ అన్నారు. మంగళవారం మునిసిపల్‌ కార్యాల‌యంలో నిర్వహించిన మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ఏడు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్‌ సర్వేలో ఆర్మూర్‌ పట్టణం రాష్ట్ర స్థాయిలో 7 వ ర్యాంకు దక్కించుకొందని, ఈ ఏడు మరింత మెరుగైన ...

Read More »

21న రాత పరీక్ష

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాల‌యంలో రికార్డు అసిస్టెంట్‌ ఉద్యోగాల‌ భర్తీ కోసం జనవరి 28న జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాత పరీక్ష నిర్వహిస్తున్నట్టు సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రిన్స్‌పల్‌ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కె. సాయి రమాదేవి తెలిపారు. నిజామాబాద్‌ నగరంలోని కాకతీయ జూనియర్‌ కళాశాల‌ క్యాంపస్‌లో మార్చి 21న రాత పరీక్ష నిర్వహించనున్నామని, అభ్యర్థుల‌కు పోస్టల్‌ ద్వారా హాల్‌ టికెట్లు పంపించామని ఆమె వివరించారు. హాల్‌ టికెట్లు అందని వారు సంస్థ ...

Read More »

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి ఉపాధి జనరేషన్‌ ప్రోగ్రాంలో యువతను ప్రోత్సహిస్తూ విరివిగా రుణాలు అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి బ్యాంకు అధికారుల‌ను కోరారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా పరిశ్రమల‌ కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాంపై కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం నిబంధనల‌ మేరకు సర్వీస్‌ సెంటర్‌లో 25 ల‌క్షల‌ వరకు రుణాలు అందించడానికి అవకాశం ఉన్నందున, ఉత్పత్తియేతర రంగంలో ...

Read More »