21న రాత పరీక్ష

నిజామాబాద్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాల‌యంలో రికార్డు అసిస్టెంట్‌ ఉద్యోగాల‌ భర్తీ కోసం జనవరి 28న జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాత పరీక్ష నిర్వహిస్తున్నట్టు సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రిన్స్‌పల్‌ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కె. సాయి రమాదేవి తెలిపారు.

నిజామాబాద్‌ నగరంలోని కాకతీయ జూనియర్‌ కళాశాల‌ క్యాంపస్‌లో మార్చి 21న రాత పరీక్ష నిర్వహించనున్నామని, అభ్యర్థుల‌కు పోస్టల్‌ ద్వారా హాల్‌ టికెట్లు పంపించామని ఆమె వివరించారు. హాల్‌ టికెట్లు అందని వారు సంస్థ కార్యాల‌యం న్యాయ సేవా సదన్‌, జిల్లా కోర్టు ప్రాంగణం నిజామాబాద్‌ పర్యవేక్షనాధికారిని సంప్రదించాల‌ని సూచించారు. పరీక్షల‌కు అవసరమైన వస్తు సామగ్రి విషయంలో తర్వాత ప్రకటనలో తెలియజేస్తామని జిల్లా జడ్జి వివరించారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article