Breaking News

Daily Archives: March 5, 2021

రుణ ల‌క్ష్యాలు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున రుణ ల‌క్ష్యాలు పూర్తి చేయుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి బ్యాంకర్లను, సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో డిసెంబర్‌లో 3 వ త్రైమాసికం సందర్బంగా బ్యాంకు డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31.12.2020 వరకు క్రాప్‌ లోన్‌ 67.71 శాతం 1738.79, అగ్రి టర్మ్‌ ...

Read More »

రేపే చివరి గడువు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు నోటిఫై చేయబడి, డ్రా వాయిదా పడిన మిగతా 11 బార్లకు దరఖాస్తుల‌ స్వీకరణ శనివారం 6వ తేదీతో ముగియనుందని జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7, ఆర్మూరుమున్సిపాలిటీ 1, బోధన్‌ మున్సిపాలిటీ 3 బార్లకు 8వ తేదీ జిల్లా ప్రోహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ కార్యాల‌యం, సుభాషనగర్‌, నిజామాబాద్‌ యందు డ్రా తీయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు దారుడు ...

Read More »

ఉత్పత్తుల‌ ఎగుమతులు ప్రోత్సాహానికి చర్యలు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పారిశ్రామిక ఉత్పత్తుల‌ను విదేశాల‌కు ఎగుమతి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల‌పై నివేదికలు అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న డెవల‌ప్‌మెంట్‌ ఆఫ్‌ డిస్ట్రిక్ట్‌ పొటెన్షియల్‌ ఎక్స్పోర్ట్‌ హబ్‌ పథకానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ చైర్మన్‌గా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలు ...

Read More »

15 వరకు ఎం.ఎడ్‌. పరీక్షల‌ ఫీజు గడువు

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌ల‌లో గల‌ ఎం.ఎడ్‌.కోర్సుకు చెందిన రెండవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌‌‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల‌కు ఎటువంటి ఆల‌స్య రుసుము లేకుండా ఈ నెల‌ 15 వ తేదీ వరకు వర్సిటీ అధికారులు ఫీజు గడువు నిర్ణయించారు. 100 రూపాయల ఆల‌స్య రుసుముతో ఈ నెల‌ 18 వరకు ఫీజును చెల్లించవచ్చన్నారు. కావున ఎం.ఎడ్‌. కళాశాల‌ల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాల‌ని, పూర్తి వివరాల‌ కోసం యూనివర్సిటి వెబ్‌ ...

Read More »

23 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌ల‌లో గల‌ పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సుల‌కు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూల‌ర్‌ పరీక్షలు ఈ నెల‌ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వర్సిటీ అధికారులు షెడ్యూల్‌ విడుదల‌ చేశారు. ఈ నెల‌ 30 వ తేదీ వరకు పరీక్షలు ...

Read More »

టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని హిందీ విభాగాధిపతిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. వి. పార్వతి నియమితుల‌య్యారు. ఉపకుల‌ప‌తి నీతూ కుమారి ప్రసాద్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియామక ఉత్తర్వుల‌ను శుక్రవారం డా. వి. పార్వతికి అందించారు. కాగా ఇప్పటి వరకు హిందీ విభాగాధిపతిగా డా. జమీల్‌ అహ్మద్‌ వ్యవహరించారు. డా. పార్వతి ప్రస్తుతం టీయూ బాలికల‌ హాస్టల్‌కు వార్డెన్‌ గా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు హిందీ విభాగానికి పాఠ్యప్రణాళికా సంఘ చైర్‌ పర్సన్‌గా కొనసాగారు. హిందీ ...

Read More »

రూ. 237 కూలి వచ్చే విధంగా పని చేయాలి

నందిపేట్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ లో కొల‌తల‌ ప్రకారం రూ. 237 కూలి వచ్చే విధంగా పనిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి కూలీల‌కు సూచించారు. శుక్రవారం వెల్మ‌ల్‌ గ్రామంలో ఉపాధి హామీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ దామం పరిశీలించారు. విజయ మిల్క్‌ పార్లర్‌ ప్రారంభించారు. దేవుని చెరువు పూడిక తీత పనుల్లో 250 మంది పాల్గొన్న కూలీల‌తో మాట్లాడారు. ప్రభుత్వం ఒకరికి 237 రూపాయలు ఇస్తుందని 237 ...

Read More »

7 నుంచి పిజి తరగతులు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పిజి ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థుల‌కు ఈనెల‌ 7వ తేదీ ఆదివారం నుండి సంసర్గ తరగతులు గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల‌ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో నిర్వహించబడతాయని అధ్యయన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిజి ద్వితీయ సంవత్సరం, డిగ్రీ సెమిస్టర్‌1, సెమిస్టర్‌ 3, సెమిస్టర్‌ 5 తరగతులు యధావిదిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా తరగతుల‌కు హాజరు కావాల‌ని ...

Read More »

అమర జవాన్‌ కుటుంబానికి ప్రవాస భారతీయుల‌ విరాళం

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నవంబర్ నెల‌లో కాశ్మీర్‌లో తీవ్రవాదుల‌ ఎదురుకాల్పుల్లో నిజామాబాద్‌ జిల్లా కోమనపల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్‌ వీర మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు చలించిన ప్రవాస భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేసే కుకునూర్‌ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ ర్యాడ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని కోమనపల్లి గ్రామమలోని కుటుంబ సభ్యుల‌కు సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ అధ్యక్షుడు రవీందర్‌ ర్యాడ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పిఏసిఎస్‌ ఉద్యోగుల‌ సంఘం ...

Read More »