Breaking News

Daily Archives: March 6, 2021

బార్లకు భారీగా దరఖాస్తులు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు నోటిఫై చేయబడి డ్రా వాయిదా పడిన 11 బార్లకు దరఖాస్తుల‌ స్వీకరణ శనివారంతో ముగిసింది. 1.నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7 బార్లకు గాను 23 దరఖాస్తులు 2. ఆర్మూరు మున్సిపాలిటీ 1 బార్లకు గాను 16 దరఖాస్తులు 3. బోధన్‌ మున్సిపాలిటీ 3 బార్లకు గాను 9 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర తెలిపారు. ఈనెల‌ 8వ తేదీ సోమవారం ఉదయం ...

Read More »

అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి

కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి కలుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం అసిస్టెంట్‌ కలెక్టరు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ శిక్షణ కాలం ముగిసినందున వీడ్కోలు సమావేశం జనహిత భవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కలెక్టరును జిల్లా కలెక్టరు, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, బాన్సువాడ ఆర్‌డివో రాజాగౌడ్‌, జిల్లా అధికారులు సన్మానించి సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ...

Read More »

బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

బోధన్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ సాధారణ సమావేశం బోధన్‌ బార్‌ అధ్యక్షుడు ఏజాజ్‌ హైమద్‌ అధ్యక్షతన నిర్వహించారు. 2021-2022 బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల‌ కోసం, ఎన్నికల‌ ప్రధాన అధికారిగా సయ్యద్‌. ఆర్రిఫోద్దీన్‌, సహాయ ఎన్నికల‌ అధికారిగా ఖాసీం బాషాను బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ వారు నియమించారు. ఎన్నికల‌ను ఈ నెల‌ 31వ తేది లోపల‌ తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు లోబడి నిర్వహించాల‌ని అధ్యక్షుడు ఏజాజ్‌ హైమద్‌ మరియు కార్యదర్శి జామంకర్‌ ...

Read More »

ట్రాఫిక్‌ విషయమై ఎస్‌హెచ్‌వోకు వినతి

బోధన్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణ ఎస్‌హెచ్‌వోకి బోధన్‌ లోని గాంధీ పార్క్‌ రైల్వే ట్రాక్‌ వద్ద ట్రాఫిక్‌ విషయంపై, బోధన్‌ పట్టణం మధ్యలోనుండి హెవీ వెహికల్స్‌ బైపాస్‌ మీదుగా తరలించడం గురించి శనివారం బోధన్‌ పట్టణం ఎస్‌హెచ్‌వోకి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్‌ చౌరస్తా గాంధీ పార్క్‌ వద్ద గ రైల్వే ట్రాక్‌ వద్ద నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువగా ఉండటం వల‌న వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గూడ్స్ రైలు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ మరింత ...

Read More »

ఢిల్లీకి తరలివెళ్లిన గల్ఫ్‌ జెఏసి ప్రతినిధుల‌ బృందం

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాల‌కు వెళ్లే కార్మికుల‌కు కనీస వేతనాలు (మినిమం రెఫరల్‌ వేజెస్‌) ను 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కుల‌ర్లను రద్దు చేయాల‌ని కోరుతూ తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (గల్ఫ్‌ జెఏసి) చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. ఎనిమిది మంది సభ్యులు గల్ఫ్‌ జెఏసి బృందం శనివారం మంచిర్యాల‌లో ఢిల్లీ వెళ్లే రైలులో బయలుదేరారు. ఈ సందర్బంగా ...

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో ఆపరేషన్‌ నిమిత్తమై బాల‌రాజు (55) ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన తోడుపునూరి శ్రీనివాస్‌ వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తాన్ని అందజేసి చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల‌ నుండి రక్తదానం ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించడం కోసం రక్తదాతల ‌సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ...

Read More »

డాక్టర్‌ శాంతాబాయికి మహిళా శిరోమణి అవార్డు

డిచ్‌పల్లి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, యూనివర్సిటీ కళాశాల‌ ఉప ప్రధానాచార్యులు డా. శాంతాబాయి మహిళా శిరోమణి అవార్డు స్వీకరించారు. తెలంగాణ సిటిజన్స్‌ కౌన్సిల్‌ (టిసిసి) వారు విద్యా, బోధానారంగంలో కృషి చేస్తున్నందుకు గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం హైదరాబాద్‌ బిర్లా మందిరంలో గల‌ బిఎం బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని భాస్కర ఆడిటోరియంలో ‘‘మహిళా శిరోమణి అవార్డ్స్‌ -2021’’ కార్యక్రమాన్ని నిర్వహించి డా. శాంతాబాయికి ప్రదానం ...

Read More »

కులాస్‌పూర్‌లో పోలీసు కళాజాత

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు శుక్రవారం మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కులాస్‌పూర్‌ గ్రామంలో పోలీసు కళా జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనల‌ గురించి, నేరాల‌ నియంత్రణ గురించి, గ్రామంలో సీసీ కెమెరాల‌ ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ లేకుండా ప్రయాణించరాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల‌ని పేర్కొన్నారు. మోసపూరిత ప్రకటనల‌ను నమ్మవద్దని, అట్టి ప్రకటనల‌ను ...

Read More »