Breaking News

ట్రాఫిక్‌ విషయమై ఎస్‌హెచ్‌వోకు వినతి

బోధన్‌, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణ ఎస్‌హెచ్‌వోకి బోధన్‌ లోని గాంధీ పార్క్‌ రైల్వే ట్రాక్‌ వద్ద ట్రాఫిక్‌ విషయంపై, బోధన్‌ పట్టణం మధ్యలోనుండి హెవీ వెహికల్స్‌ బైపాస్‌ మీదుగా తరలించడం గురించి శనివారం బోధన్‌ పట్టణం ఎస్‌హెచ్‌వోకి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్‌ చౌరస్తా గాంధీ పార్క్‌ వద్ద గ రైల్వే ట్రాక్‌ వద్ద నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువగా ఉండటం వల‌న వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గూడ్స్ రైలు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ మరింత ఎక్కువగా కావడం వల‌న గంటల‌ తరబడి ట్రాఫిక్‌లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

అంతేకాదు ఎమర్జెన్సీ వాహనాలు 108, ఫైర్‌ ఇంజన్‌ ఇతర వాహనాలు ఇదే ట్రాఫిక్‌ జామ్‌లో కొన్ని గంటల‌ తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెల‌కొందని, బోధన్‌ పట్టణంలోకి భారీ వాహనాలు రావడంతో దుమ్ము, ధూళి లేవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్నారన్నారు. కావున సమస్యను పరిష్కరించగల‌రని కోరుతు బోధన్‌ ఓల్డ్‌ సిటీ యూత్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కడికే శివ, గంగుల‌ శ్రీకాంత్‌, జెల్లా సతీష్‌, బి రమేష్‌, ఐరేండ్ల రాజు, ఐ చరణ్‌, రవి, సుధాకర్‌ తదితరులున్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article