Breaking News

Daily Archives: March 8, 2021

శతాధిక కవి సమ్మేళనంలో జిల్లా వాసి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వై ఎన్‌హెచ్‌ఎ హాల్‌ లో ఆదివారం అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్‌ కత్తిమండ ప్రతాప్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో పలు రాష్ట్రాల‌కు‌ చెందిన కవులు 150 మంది పాల్గొన్నారు. సాహిత్యాన్ని కవిత్వాన్ని ప్రోత్సహించాల‌నే దిశగా శ్రీ శ్రీ కళా వేదిక పది సంవత్సరాల‌ నుండి పనిచేస్తుంది. పదవ వార్షికోత్సవం సందర్భంగా కామారెడ్డి ...

Read More »

కబేళాలు మూసివేసేంత వరకు ఉద్యమిస్తాము…

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుగ తుల‌సి ఫౌండేషన్‌ వారు గోమాతను జాతీయ పాణిగా ప్రకటించాల‌ని, గోహత్యలు ఆపాల‌ని, అక్రమ కబేళాలు మూసివేయాల‌ని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 1 న ఎన్‌టిఆర్‌ మైదానంలో నిర్వహించే గో మహాగర్జన- భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని ప్రచారం చేస్తూ గోమహా గర్జన ప్రచార రథం భాగ్యనగర్‌ నుండి బయలుదేరి కామారెడ్డికి చేరుకుంది. వారికి బీజేపీ కామారెడ్డి శాఖ తరుపున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాత్ర ప్రముఖ్‌, విశ్వ ...

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కు చట్టం 2005 ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రామారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల ‌విద్యాల‌యంలో ప్రత్యేక అధికారిని టి. వనితను ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు ల‌క్కాకుల‌ నరేష్‌ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు భవాని పేట సుమన్‌, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల నవీన్‌, కార్యదర్శి భవాని పేట నితిన్‌, విద్యాల‌య మహిళా అధికారులు పద్మ, శ్రీదేవి, కరుణ, భాగ్యల‌క్ష్మి బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనులు పూర్తి చేయించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పర్యటించి పర్యవేక్షణ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా అధికారుల‌కు ఉద్యోగినుల‌కు అభినందనలు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా అధికారులు తనిఖీలు చాలా వరకు పెరిగినప్పటికీ పనుల్లో కూడా క్వాలిటీ పెరగాల‌న్నారు. ప్రభుత్వం చేపడుతున్న పనుల‌కు ముఖ్యమైన కార్యక్రమాల‌కు ప్రయారిటీ ...

Read More »

మహిళల్లో పని చేయాల‌న్న తపన ఉంది

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల్లో పని చేయాల‌న్న తపన, ధైర్యం దాగి ఉన్నాయని వారికి ఏ పని అప్పగించిన మంచి ఫలితాలు తెస్తారని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన నగర మేయర్‌ నీతూ కిరన్‌తో కలిసి జ్యోతి ప్రజ్వల‌న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ...

Read More »

మహిళలు ఎందులోనూ తీసిపోరు

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు పురుషుల‌ కంటే ఎందులోనూ తీసిపోరని, అన్ని రంగాల‌లో రాణిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో టీఎన్జీవో హోంలో ఏర్పాటుచేసిన మహిళ ఉద్యోగుల‌ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల‌లో రాణించగల‌రని ఒక అడుగు ముందుకు వేసి వెళ్లగల‌రని అన్నారు. అన్ని విషయాల‌ను సమగ్ర పరిశీల‌నతో ప్రాపర్‌గా హాండిల్‌ చేయగలుగుతారని, మహిళ ఉద్యోగుల‌ ...

Read More »

ఆర్మూర్‌ బార్‌ దక్కించుకున్న తాటికొండ అనిల్‌కుమార్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మునిసిపాలిటి పరిధిలో కొత్తగా నోటిఫై చేయబడిన ఒక బార్‌కు జిల్లా కలెక్టర్‌ దరఖాస్తు దారుల‌ సమక్షంలో సోమవారం జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ నిజామాబాద్‌ కార్యాల‌యం యందు డ్రా తీశారు. తాటికొండ అనిల్‌కుమార్‌ (సీరియల్‌ నెంబర్‌ 11) బార్‌ దక్కించుకున్నాడు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7, బోధన్‌ మునిసిపాలిటి 3 నోటిఫై చేయబడిన బార్లకు ఎక్సైజ్‌ కమీషనర్‌ ఆదేశాల‌ మేరకు తదుపరి డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ...

Read More »