Breaking News

ఆర్మూర్‌ బార్‌ దక్కించుకున్న తాటికొండ అనిల్‌కుమార్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మునిసిపాలిటి పరిధిలో కొత్తగా నోటిఫై చేయబడిన ఒక బార్‌కు జిల్లా కలెక్టర్‌ దరఖాస్తు దారుల‌ సమక్షంలో సోమవారం జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ నిజామాబాద్‌ కార్యాల‌యం యందు డ్రా తీశారు.

తాటికొండ అనిల్‌కుమార్‌ (సీరియల్‌ నెంబర్‌ 11) బార్‌ దక్కించుకున్నాడు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7, బోధన్‌ మునిసిపాలిటి 3 నోటిఫై చేయబడిన బార్లకు ఎక్సైజ్‌ కమీషనర్‌ ఆదేశాల‌ మేరకు తదుపరి డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌చంద్ర, సిఐ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ ...

Comment on the article