Breaking News

Daily Archives: March 9, 2021

బైకు దొంగల‌ అరెస్టు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ పరిదిలో మోటార్‌ సైకిల్లు దొంగతనాలు చేస్తున్న ముఠాకి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలే నర్సిరు కామారెడ్డి, బొల్లిపల్లి భానుప్రసాద్‌ కామారెడ్డి మరియు బట్టు ప్రశాంత్‌ ఆర్మూర్‌ల‌ను అరెస్టు చేసి వారి నుండి 6 మోటార్‌ సైకిల్‌ను స్వాధీనపర్చుకొన్నట్టు కామారెడ్డి రూరల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ పేర్కొన్నారు. ముగ్గురిని జైలుకు పంపించామన్నారు. వీటి విలువ సుమారు 3 ల‌క్షల‌ రూపాయల‌ వరకు ఉంటుందన్నారు. కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన సిసిటివి ...

Read More »

తండ్రిని కడతేర్చిన తనయుడు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాకి చెందిన భూక్యా ఫకీర (65), అతడి కొడుకు భూక్యా బాష భాస్కర్‌ ఇద్దరికీ గత మూడు రోజుల‌ నుండి ఫకీరా ఆంధ్రా బ్యాంక్‌ నందు తీసుకున్న డబ్బు విషయంలో గొడవ‌లు జరుగుతున్నాయి. కాగా మంగళవారం ఉదయం తండ్రి, కొడుకుల‌ మధ్య తగాదా కాగా బాష తన తండ్రిని డబ్బు విషయం గురించి మాట్లాడుదామని ఉగ్రవాయి గ్రామ శివారులోకి తీసుకెళ్ళి, అక్కడ తన తండ్రిని కొట్టి చంపి, ఉరి ...

Read More »

కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించిన గల్ఫ్‌ జెఏసి ప్రతినిధులు

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 88 ల‌క్షల‌ భారతీయ గల్ఫ్‌ కార్మికుల‌ జీవితాల‌పై ప్రభావం చూపే కనీస వేతనాల‌ తగ్గింపు సమస్యపై తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (గల్ఫ్‌ జెఏసి) ప్రతినిధులు బృందం మంగళవారం కేంద్ర విదేశీ వ్యవహారాల‌ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్‌ కార్మికుల‌కు 30 నుండి 50 శాతం వేతనాలు తగ్గించడం వల‌న వారు మరింత పేదరికంలోకి జారిపోయే అవకాశమున్నదని, కనీస వేతనాల‌ను తగ్గిస్తూ భారత ...

Read More »

108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం భవానిపేట్‌ తండాకు చెందిన భానోత్‌ శైల‌జకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌ కు ఫోను చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే శైల‌జని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాగా పురిటి నొప్పులు అధికం అవడంతో, అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. మొదటి కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి – బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం జిల్లా ప్రభుత్వ ...

Read More »

జర్నలిస్టుల‌పై దాడులు అరికట్టాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో మంగళవారం ఆర్మూర్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రోడ్లు, భవనాల‌ అతిథి గృహం నుండి నినాదాలు చేస్తూ అంబెడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం అధ్యక్షుడు శంకర్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల‌పై దాడుల‌ను అరికట్టాల‌ని, బైంసా, వరంగల్‌ ఘటనలో జర్నలిస్ట్‌ల‌పై జరిగిన దాడుల‌ను ఖండిస్తూ దుండగుల‌ను పట్టుకొని కఠినంగా శిక్షించాల‌ని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దళిత జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పొన్నాల‌ ...

Read More »

అధికారిపై కలెక్టర్‌ ఆగ్రహం

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌తో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెల‌కొందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం భూంపల్లి, సదాశివనగర్‌ పల్లె ప్రకృతి వనాల‌ను ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామీణ ప్రజల‌కు స్వచ్చమైన గాలిని అందిస్తాయని సూచించారు. ఉదయం పూట గ్రామీణులు వాకింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల‌కు పరిశుభ్రమైన వాతావరణంను అందించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడంలో గ్రామపంచాయతీలు కీల‌క పాత్ర పోషించాల‌ని కోరారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా ...

Read More »

30లోగా వ్యవసాయ రుణాలు రెన్యువల్‌ చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రుణాలు మార్చి 30 లోగా రెన్యువల్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారుల‌ను, బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి వ్యవసాయ రుణాలు, బ్యాంకు లింకేజీ, కొత్త స్వయం సహాయక సంఘాల‌ ఏర్పాటు, జాతీయ ఉపాధి పథకంలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు కల్లాలు, వైకుంఠ ధామాల‌పై బ్యాంకర్స్‌, మండల‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల‌ ...

Read More »

టిఆర్‌ఎస్‌కు ఓటు వేయద్దు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందలాది మంది నిరుద్యోగుల‌ ఉద్యోగాలు భర్తీ లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతులు టిఆర్‌ఎస్ పాల‌నలో ఉద్యోగాలు ఇక రావని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని నిరుద్యోగుల‌ను ఆత్మహత్య చేసుకునేలా చేసిన టిఆర్‌ఎస్‌కు ఓటువేయ వద్దనీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్ పిలుపునిచ్చారు. ఏం ముఖం పెట్టుకొని నిరుద్యోగుల విద్యార్థుల‌ ఓట్లు ...

Read More »

15 రోజుల్లో సర్వే పూర్తి కావాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫారెస్టు, రెవిన్యూ శాఖ భూముల‌కు సంబంధించిన సర్వే 15 రోజుల్లో పూర్తి చేయాల‌ని కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఫారెస్ట్‌, రెవిన్యూ, సర్వే శాఖల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు అటవీ భూముల‌కు ఆనుకొని ఉన్నాయో అక్కడ ఫారెస్ట్‌ భూముల‌ను సర్వే చేసి హద్దులు నిర్ణయించాల‌ని అన్నారు. The survey should be completed ...

Read More »

2వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈనెల‌ 13వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ 2వ సెమిస్టర్‌ పరీక్షల‌ను ఎంఎల్‌సి ఎన్నికల‌ కారణంగా వాయిదా వేసినట్టు ప్రాంతీయ అధ్యయన కేంద్ర సమన్వయ కర్త డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈనెల‌ 30 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. అలాగే ఈనెల‌ 21వ తేదీ నుంచి జరగాల్సిన 4వ సెమిస్టర్‌ పరీక్షలు యదావిధిగా నిర్వహించబడతాయని అన్నారు. అభ్యర్థులు వారి ...

Read More »

న్యాయవాదుల‌ రక్షణ చట్టం కోసం చలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదుల‌ రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ హైకోర్టు న్యాయవాదులు వామనరావ్‌ నాగమణి దంపతుల‌ జంట హత్యలు నిరసిస్తూ తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషస్స్ పిలుపుమేరకు తమ ఆందోళనలో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి చలో హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ ఇందిరాపార్క్‌ వద్దకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచికట్ల గోవర్థన్‌ మాట్లాడుతూ న్యాయవాదుల‌ హత్యల‌ ...

Read More »