2వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌, మార్చ్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈనెల‌ 13వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ 2వ సెమిస్టర్‌ పరీక్షల‌ను ఎంఎల్‌సి ఎన్నికల‌ కారణంగా వాయిదా వేసినట్టు ప్రాంతీయ అధ్యయన కేంద్ర సమన్వయ కర్త డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈనెల‌ 30 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడతాయన్నారు.

అలాగే ఈనెల‌ 21వ తేదీ నుంచి జరగాల్సిన 4వ సెమిస్టర్‌ పరీక్షలు యదావిధిగా నిర్వహించబడతాయని అన్నారు. అభ్యర్థులు వారి హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల‌ని సూచించారు. డిగ్రీ, పిజి తరగతులు ఈనెల‌ రెండవ శనివారం 13వ తేదీ, ఆదివారం 14వ తేదీ జరుగుతాయన్నారు. అభ్యర్థులు తప్పక హాజరు కావాల‌ని సూచించారు. మరిన్ని వివరాల‌కు వెబ్‌సైట్‌ను సందర్శించాల‌న్నారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు ...

Comment on the article