Breaking News

బైకు దొంగల‌ అరెస్టు

కామారెడ్డి, మార్చ్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ పరిదిలో మోటార్‌ సైకిల్లు దొంగతనాలు చేస్తున్న ముఠాకి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలే నర్సిరు కామారెడ్డి, బొల్లిపల్లి భానుప్రసాద్‌ కామారెడ్డి మరియు బట్టు ప్రశాంత్‌ ఆర్మూర్‌ల‌ను అరెస్టు చేసి వారి నుండి 6 మోటార్‌ సైకిల్‌ను స్వాధీనపర్చుకొన్నట్టు కామారెడ్డి రూరల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ పేర్కొన్నారు.

ముగ్గురిని జైలుకు పంపించామన్నారు. వీటి విలువ సుమారు 3 ల‌క్షల‌ రూపాయల‌ వరకు ఉంటుందన్నారు. కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల‌ ఆధారంగా పై నేరస్తుల‌ను గుర్తించి పట్టుకున్నామన్నారు. కాబట్టి ప్రజలందరు సిసి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు.

Check Also

టేక్రియాల్‌లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనేకమంది ...

Comment on the article