Breaking News

న్యాయవాదుల‌ రక్షణ చట్టం కోసం చలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదుల‌ రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ హైకోర్టు న్యాయవాదులు వామనరావ్‌ నాగమణి దంపతుల‌ జంట హత్యలు నిరసిస్తూ తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషస్స్ పిలుపుమేరకు తమ ఆందోళనలో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి చలో హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ ఇందిరాపార్క్‌ వద్దకు బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచికట్ల గోవర్థన్‌ మాట్లాడుతూ న్యాయవాదుల‌ హత్యల‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించాల‌ని డిమాండ్‌ చేశారు. బాధిత న్యాయవాద కుటుంబాల‌కు ఐదు కోట్ల రూపాయల‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించాల‌ని, ప్రత్యేక ఫాస్ట్ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాల‌ని, న్యాయవాద వృత్తి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల‌ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

లేనిపక్షంలో ఉద్యమం దశల‌వారీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి శ్రీధర్‌, ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్‌ మోహన్‌ గౌడ్‌, దుర్గం సాయిబాబా, సంజేగౌడ్‌, పిల్లి శ్రీకాంత్‌, నాగ సురేష్‌, శరత్‌ చంద్ర, సాయిబాబా, గంగొని శుభం, గణేష్‌, గంగోని శ్రీనివాస్‌, చరణ్‌ కుమార్‌, నూనే రత్నకర్‌, భుమేశ్వర్‌ సుదర్శన్‌ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article