Breaking News

టిఆర్‌ఎస్‌కు ఓటు వేయద్దు

కామారెడ్డి, మార్చ్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందలాది మంది నిరుద్యోగుల‌ ఉద్యోగాలు భర్తీ లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతులు టిఆర్‌ఎస్ పాల‌నలో ఉద్యోగాలు ఇక రావని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని నిరుద్యోగుల‌ను ఆత్మహత్య చేసుకునేలా చేసిన టిఆర్‌ఎస్‌కు ఓటువేయ వద్దనీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్ పిలుపునిచ్చారు.

ఏం ముఖం పెట్టుకొని నిరుద్యోగుల విద్యార్థుల‌ ఓట్లు అడుగుతున్నారని, ఓట్లు అడిగే నైతిక హక్కును టిఆర్‌ఎస్‌ నాయకులు కోల్పోవడం జరిగిందని యూనివర్సిటీలో వి.సి.లు లేక అధ్యాపకులు లేక గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద మధ్య తరగతి విద్యార్థులు యూనివర్సిటీల‌కు చదువుకోడానికి వెళితే వారి జీవితాలు నాశనం కావడం జరుగుతుందన్నారు. వీటన్నిటికీ టిఆర్‌ఎస్‌ పార్టీ యొక్క అసమర్ధత కారణమని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి తధ్యమని, డిపాజిట్లను కూడా నిరుద్యోగులు విద్యార్థులు గ‌ల్లంతు చేస్తారన్నారు. సమావేశంలో నాయకులు అంజల్‌ రెడ్డి, సతీష్‌ పాల్గొన్నారు.

Check Also

మే 5 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లోని బి.ఎడ్‌. కోర్సుల‌కు ...

Comment on the article