Breaking News

తండ్రిని కడతేర్చిన తనయుడు

కామారెడ్డి, మార్చ్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాకి చెందిన భూక్యా ఫకీర (65), అతడి కొడుకు భూక్యా బాష భాస్కర్‌ ఇద్దరికీ గత మూడు రోజుల‌ నుండి ఫకీరా ఆంధ్రా బ్యాంక్‌ నందు తీసుకున్న డబ్బు విషయంలో గొడవ‌లు జరుగుతున్నాయి.

కాగా మంగళవారం ఉదయం తండ్రి, కొడుకుల‌ మధ్య తగాదా కాగా బాష తన తండ్రిని డబ్బు విషయం గురించి మాట్లాడుదామని ఉగ్రవాయి గ్రామ శివారులోకి తీసుకెళ్ళి, అక్కడ తన తండ్రిని కొట్టి చంపి, ఉరి వేసుకున్నట్టుగా చెట్టుకి వేలాడదీశాడని కామారెడ్డి రూరల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ పేర్కొన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ అనంతరం నేరస్తుడిని కోర్ట్‌లో హాజరు పరుస్తామన్నారు.

Check Also

టేక్రియాల్‌లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనేకమంది ...

Comment on the article