Breaking News

Daily Archives: March 10, 2021

కామారెడ్డిలో మహాశివరాత్రి జాగరణ

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తెలిపారు. జాగరణ కార్యక్రమంలో భాగంగా జెపిఎన్‌ రోడ్డులో మానస సరోవరం సెట్టింగ్‌ మరియు శివ లింగం ఏర్పాటు చేసి 8 గంటల‌ నుండి పూజా కార్యక్రమాల‌ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. 12.14 నిమిషాల‌కు లింగోద్భవ కార్యక్రమం ...

Read More »

పన్నుల‌ వసూలులో వంద శాతం ల‌క్ష్యం పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వంద శాతం ల‌క్ష్యాన్ని చేరుకునే విధంగా కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాల‌యంలో బుధవారం ఆయన మున్సిపల్‌ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వసూళ్లు చేసిన ఆస్తిపన్ను వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా వసూలు చేపట్టాల‌ని సూచించారు. కొత్తగా పెరిగిన ఇళ్ళ వివరాల‌ను మున్సిపల్‌ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్‌ బడ్జెట్‌ను ...

Read More »

18 వరకు రివాల్యుయేషన్‌, రికౌంటింగ్‌ గడువు

డిచ్‌పల్లి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లో గల‌ బి.ఎడ్‌.కోర్సుల‌కు చెందిన మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ మరియు రెండవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌, బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు డిసెంబర్‌ 2020 లో జరిగిన విషయం విదితమే. కాగా పరీక్ష సమాధాన పత్రాల‌కు ఈ నెల‌ 18 వ తేదీ వరకు రివాల్యుయేషన్‌, రికౌంటింగ్‌ గడువు అధికారులు నిర్ణయించారు. ఒక్కో పేపర్‌కు రివాల్యుయేషన్‌ రూ. 500, ఒక్కో పేపర్‌ కు రికౌంటింగ్‌ రూ. 300, ...

Read More »

జిల్లా ప్రజల‌కు మహాశివరాత్రి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గ ృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ప్రజల‌కు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజల‌ను భక్తి ప్రపత్తుల‌తో నిర్వహిస్తున్న భక్తుల‌కు దేవదేవుని ఆశీర్వాదం ఎల్ల‌వేళలా వుండాల‌ని, తెలంగాణ ప్రజల‌కు సుఖ సంతోషాల‌ను శాంతిని ప్రసాదించాల‌ని గరళకంఠున్ని మంత్రి వేముల‌ ప్రార్థించారు.

Read More »

పిల్ల‌ల‌ విషయంలో నిర్లక్ష్యం వద్దు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వ‌ల్ల‌ సుమారు సంవత్సరం పాటు వసతి గృహాల‌కు చదువుల‌కు దూరంగా ఉన్న బిసి, ఎస్సి, ఎస్టీ విద్యార్థుల‌కు అన్ని రకాల‌ సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాటు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. బుదవారం ప్రగతి భవన్‌లో సంక్షేమ అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సి, ఎస్టీ, సంక్షేమ విద్యార్థుల‌కు అందుతున్న సదుపాయాల‌తో పాటు సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాల‌న్నారు. ...

Read More »

జర్నలిస్టుల సేవ‌లు మరువలేనివి

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల సేవ‌లు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో కూడా తమ ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వహించారని గుర్తుచేశారు. జర్నలిస్టులు వారి కుటుంబాల‌కు విద్య వైద్య పరంగా సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌ మైదానంలో జరిగిన నిజామాబాద్‌ అర్బన్‌ జర్నలిస్ట్‌ మెమోరియల్‌ సొసైటీ ఆవిర్భావ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల‌ విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం ...

Read More »

చికిత్స పొందుతూ యువతి మృతి

గాంధారి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్దరాత్రి మృతి చెందినట్లు గాంధారి ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. మండలంలోని మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల‌ సౌందర్య (21) గత నెల‌ 18 వ తేదీన వారి ఇంటి వద్ద ఖాలీ స్థలంలో పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి యువతిని నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ...

Read More »