Breaking News

కామారెడ్డిలో మహాశివరాత్రి జాగరణ

కామారెడ్డి, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తెలిపారు. జాగరణ కార్యక్రమంలో భాగంగా జెపిఎన్‌ రోడ్డులో మానస సరోవరం సెట్టింగ్‌ మరియు శివ లింగం ఏర్పాటు చేసి 8 గంటల‌ నుండి పూజా కార్యక్రమాల‌ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.

12.14 నిమిషాల‌కు లింగోద్భవ కార్యక్రమం కూడా నిర్వహించనున్నామని ఉపవాసం ఉన్న భక్తులు లింగార్చన, అభిషేక కార్యక్రమాలు కూడా చేసుకునేందుకు వీలు ఉన్నదని కావున శివ భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article