Breaking News

పన్నుల‌ వసూలులో వంద శాతం ల‌క్ష్యం పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వంద శాతం ల‌క్ష్యాన్ని చేరుకునే విధంగా కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాల‌యంలో బుధవారం ఆయన మున్సిపల్‌ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వసూళ్లు చేసిన ఆస్తిపన్ను వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు.

గత ఏడాది కంటే ఎక్కువగా వసూలు చేపట్టాల‌ని సూచించారు. కొత్తగా పెరిగిన ఇళ్ళ వివరాల‌ను మున్సిపల్‌ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్‌ బడ్జెట్‌ను వినియోగించి పచ్చదనాన్ని పెంపొందించుకోవాల‌ని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ కమిషనర్లు దేవేందర్‌, రమేష్‌, జీవన్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article