Breaking News

చికిత్స పొందుతూ యువతి మృతి

గాంధారి, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్దరాత్రి మృతి చెందినట్లు గాంధారి ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. మండలంలోని మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల‌ సౌందర్య (21) గత నెల‌ 18 వ తేదీన వారి ఇంటి వద్ద ఖాలీ స్థలంలో పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి యువతిని నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 2 గంటల‌ సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు కొర్పోల్‌ గ్రామానికి చెందిన వారి బంధువుల‌ అబ్బాయి కర్రో స్వామిని ప్రేమించగా పెద్దలు పెళ్ళికి ఒప్పుకున్నారు.

అయితే ప్రియుడు స్వామి అదనపు కట్నం రెండు ల‌క్షలు, బైక్ కావాల‌ని వేదించగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి రాయల‌ సాయిలు పోలీసుల‌కు పిర్యాదు చేశాడని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

Check Also

మాతు సంగెంలో కుస్తీ పోటీలు

గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ...

Comment on the article