Breaking News

Daily Archives: March 13, 2021

మోర్తాడ్‌ చేరిన ఎల‌క్ట్రికల్‌ రైల్‌

మోర్తాడ్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లాలోని మోర్తాడ్‌ మండల‌ కేంద్రానికి జగిత్యాల‌ నుండి బయలుదేరిన ఎల‌క్ట్రికల్‌ రైల్‌ శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఇక్కడి రైల్వేస్టేషన్‌లో అధికారులు రైలుకు ఘనంగా స్వాగతం పలికారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌ జికే రాయ్‌కు అధికారులు సిబ్బంది స్వాగతం పలికారు. ఎల‌క్ట్రికల్ రైలు విజయవంతంగా మండల‌ కేంద్రమైన మోర్తాడ్‌ వరకు చేరుకోవడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

Read More »

ఎన్‌డిసిసిబి డైరక్టర్‌కు సన్మానము

మోర్తాడ్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌డిసిసిబి డైరెక్టర్‌గా ఏకగ్రివంగా ఎన్నికైన మెతుకు భూమన్నను టీఆర్‌ఎస్‌ నాయకులు కల్లెడ ఏలీయా, మండల‌ ప్రజా పరిషత్ అద్యక్షుడు శివలింగు, శ్రీనివాస్‌, జడ్పీటీసి బద్దం రవి, పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్లెం అశోక్‌ రెడ్డి, ధోన్పాల్‌ సర్పంచ్‌ పర్సా దేవన్న, వైస్‌ ఎంపిపి తోగట్టి శ్రీనివాస్‌, ఎంపిటీసి అజార్‌ తదితరులు సన్మానం చేశారు.

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

బోధన్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరు గ్రామంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుద్దె సావిత్రి, సీనియర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు బుద్దే రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని హనుమాన్ ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాదు జిల్లాలోని అనేక చోట్ల గత కొన్ని సంవత్సరాల‌ నుంచి పేద ప్రజల‌కు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మందికి ఉత్తమ సేవ‌లు అందిస్తున్న ఎమ్మెల్సీ కవిత సేవ‌లు ...

Read More »

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంఎల్‌సి జన్మదిన వేడుకలు

గాంధారి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత జన్మదిన వేడుకలు రామారెడ్డి మండల‌ కేంద్రంలోని కాల‌భైరవ స్వామి ఆల‌యంలో శనివారం నిర్వహించారు. ఆల‌యంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు ఆధ్వర్యంలో రామారెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా బాద్యులు వంశీ, వెంకటరెడ్డి, చక్రధర్‌, రాజు, పద్మజా, జీవన్‌ గౌడ్‌, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Read More »

మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న మాజీ మంత్రి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో, రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేయించుకున్నారు. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు భయం పోగొట్టేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ శనివారం అపోలో ఆస్పత్రి జూబ్లీహిల్స్‌లో కో వ్యాక్సిన్‌ టీకా మొదటి ...

Read More »

అధ్యాపకులు లేకుండానే విద్యాబోధన

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల‌ విద్యార్థి సంఘాలు టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సమస్యల‌ను విద్యార్థి సంఘ నాయకుల‌ దృష్టికి తీసుకొచ్చారు. కళాశాల‌ ప్రారంభమైనప్పటికీ అధ్యాపకులు లేరని కెమిస్ట్రీ, బాటని, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎంపిహెచ్డబ్ల్యూ కోర్స్‌లో అధ్యాపకులు లేకుండానే కళాశాల‌లు కొనసాగుతున్నాయని తమ జీవితాల‌ను ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ...

Read More »

కళ్యాణల‌క్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి మండలానికి చెందిన 23 మందికి, రామారెడ్డి మండలానికి చెందిన 5 మంది ల‌బ్దిదారుల‌కు 28 ల‌క్షల‌ 3 వేల‌ 248 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 వేల‌ 545 మందికి 35 కోట్ల 9 ల‌క్షల‌ 78 వేల‌ 900 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది ...

Read More »