Breaking News

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

బోధన్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరు గ్రామంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుద్దె సావిత్రి, సీనియర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు బుద్దే రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని హనుమాన్ ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిజామాబాదు జిల్లాలోని అనేక చోట్ల గత కొన్ని సంవత్సరాల‌ నుంచి పేద ప్రజల‌కు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మందికి ఉత్తమ సేవ‌లు అందిస్తున్న ఎమ్మెల్సీ కవిత సేవ‌లు అద్భుతం అని కొనియాడారు.

అనునిత్యం ప్రజాసేవ తన ల‌క్ష్యంగా భావించి ప్రజల‌ వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండే గొప్ప మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అని తెలిపారు.

కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బి. శివకాంత్‌, ఎంపిటిసి కండె సవిత సంజీవ్‌ కుమార్‌, ఉప సర్పంచ్‌ సరిడే సాయులు, వార్డు సభ్యులు, జ్యోతి, సుజాత, గోదావరి, పద్మ, గంగాధర్‌, పోశెట్టి, దార్ష. గంగాధర్‌, సాలూర ఎండీ. షకీల్‌, దత్తు, బుయ్యన్‌ సురేష్‌, చందూర్‌ సాయిరెడ్డి, కేజీ గంగారాం, బిళ్ళ. హన్మాండ్లు, ఖదీర్‌, వెంకట్‌ పటేల్‌, ముట్టెన్‌. శంకర్‌, బండే.గంగాధర్‌, క‌ల్లూర్ ల‌క్ష్మణ్‌, ఆర్‌.లింగయ్య, ఎస్‌. భీమయ్య, ల‌స్మన్న, గౌరజీ, కన్నె. రమేష్‌, ఇళ్తేపు సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article