Daily Archives: March 15, 2021

ప్రజావాణి ఫిర్యాదుల‌ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదుల‌ పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాల క‌ల్ప‌నకు జాబ్‌ మేళా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాల‌ని, అదేవిధంగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కారం చేయాల‌ని, వచ్చిన పిర్యాదు దారునికి రూల్‌ ప్రకారం ...

Read More »

రజక ఐక్యవేదిక బాల్కొండ నియోజకవర్గ బాధ్యునిగా యానంపల్లి వినోద్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కమిటీ మోర్తాడ్‌కు చెందిన యానంపల్లి వినోద్‌ బాల్కొండ నియోజకవర్గ బాధ్యులుగా నియామకం చేసి వారికి జిల్లా అధ్యక్షుడు చింతకుంట శంకర్‌ మరియు కమిటీ సభ్యులు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శంకర్‌ మాట్లాడుతూ జాతి ఐక్యత కోసం అభివృద్ధి కోసం పాటుపడాల‌ని వినోద్‌కు సూచించారు. పదవి బాధ్యతలు తీసుకున్న వినోద్‌ చేత కమిటీ సభ్యులు ప్రమాణ ...

Read More »

వినియోగదారుల‌ హక్కుల‌ని వినియోగించుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిఒక్క వినియోగదారుడు తన హక్కుల‌ను సమాజంలో వినియోగించుకోవాల‌ని తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌, కో-కన్వీనర్‌లు తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్‌లు అన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల‌ హక్కుల‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సాందీపని కళాశాల‌లో విద్యార్థినివిద్యార్థుల‌కు వినియోగదారుల‌ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కల్తీ సమాజంలో ప్రతిఒక వినియోగదారుడు తమ హక్కుల‌ను వినియోగించుకుంటు ...

Read More »

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రయివేటికరణ, కార్పోరేటికరణ వ్యతిరేక దినంగా నిరసన కార్యక్రమాలు చేయాల‌ని కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయని, దాంట్లో భాగంగానే నిరసన కార్యక్రమమన్నారు. కేంద్రంలోని మోడి నాయకత్వంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ ...

Read More »

కలెక్టర్‌ను కలిసిన శిక్షణ ఐఏఎస్‌లు

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ ఆధారిత జిల్లా అని, పంట సాగులో ఎంతో పేరు ప్రతిష్టలు, ఆకలి ఉండదని ముఖ్యంగా పసుపు వరిలో మంచి దిగుబడులు నాణ్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రగతి భవనంలో తనను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌ల‌‌‌తో జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, సాగు పరిస్థితులు, నీటి ల‌భ్యత తదితర విషయాల‌పై ఆయన వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నిజామాబాద్‌లో అధికంగా వరి , సోయాబీన్‌, ...

Read More »