Breaking News

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రయివేటికరణ, కార్పోరేటికరణ వ్యతిరేక దినంగా నిరసన కార్యక్రమాలు చేయాల‌ని కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయని, దాంట్లో భాగంగానే నిరసన కార్యక్రమమన్నారు.

కేంద్రంలోని మోడి నాయకత్వంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, విమానయానం, బొగ్గు ఘనులు, ఎల్‌ఐసి, రక్షణ రంగం ల‌న్నింటిని ఒక్కొక్క దాంట్లో ప్రభుత్వ వాటాను తగ్గిస్తూ ప్రయివేటీకరణకు పూనుకుంటున్నారని మండి పడ్డారు. దేశ సంపదను కార్పోరేట్‌ శక్తుల‌కు అప్పజెప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

గత పాల‌కులు సంస్థల‌ను, ప్రాజెక్టుల‌ను జాతీయ కరణ జేస్తే, నేడు బీజేపీ పార్టీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థల‌న్నింటిని ప్రయివేటికరిస్తూ దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే విదంగా ప్రవర్తిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పి.శంకర్‌, బి.నాగమణి, పాషా బేగం, జి.సీతారాం, డి.పొశెట్టి, కె.రవి, ఎన్‌.గంగారాం, పొశెట్టి, మైబూబ్‌, సలీం, సిహెచ్‌ గంగయ్య, నిర్మ, గంగామని, రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article