Breaking News

Daily Archives: March 16, 2021

ఆర్మూర్‌లో బ్యాంకు ఉద్యోగుల‌ నిరసన

ఆర్మూర్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశానికి స్వాతంత్రం సిద్దించిన తరవాత ప్రజలు వారి ఆర్థిక అవసరాల‌కోసం వడ్డీ వ్యాపారుల‌ వద్దకు వెళ్లకూడదని, అప్పటికే వడ్డీ వ్యాపారుల‌ కబంధ హస్తాల‌లో ఉన్న పేద మరియు మధ్యతరగతి ప్రజల‌ను కాపాడాలి, అలాగే దేశంలోని ప్రజల‌ కష్టార్జితమైన సొమ్ముకు భద్రత కల్పించాల‌నే సదుద్దేశంతో రెండు విడుతల‌లో దేశంలోని 20 బ్యాంకుల‌ను జాతీయం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బ్యాంకు ఉద్యోగులు, పలు సంఘాల‌ నాయకులు పేర్కొన్నారు. అలా జాతీయం చేయబడిన బ్యాంకులు ఆనాటి ...

Read More »

విద్యార్థుల‌ను పరీక్షల‌కు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి విద్యార్థుల‌ను బోర్డ్‌ పరీక్షల‌కు హాజరయ్యే విధంగా తయారుచేసి పంపిస్తే తప్పక వారి జీవితాల‌లో వెలుగులు నింపిన వారమవుతామని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం 9, 10 తరగతి విద్యార్థుల‌ పరీక్షల‌ గురించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్‌, వెల్ఫేర్‌, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, వసతిగృహా సంక్షేమ అధికారుల‌తో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. కరోనా వ‌ల్ల‌ ఈ సంవత్సరంలో నాలుగు నుండి ఐదు నెల‌లు ...

Read More »

కేంద్ర ప్రభుత్వంపై పోరాటాల‌కు సిద్ధం కావాలి

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి ఎఐటియుసి కార్యాల‌యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల‌కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జి రాజు, మాజీ జిల్లా కార్యదర్శి ఎల్‌ దశరథ్‌ మాట్లాడుతూ కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల‌ను ఐదు ల‌క్షల‌ కోట్లకు ఆదాని అంబానికి కార్పొరేట్‌ కంపెనీల‌కు అమ్మటానికి సిద్ధ పడుతున్నాయని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. అలాగే ఎల్‌ఐసి వైద్యరంగం, రైల్వే రంగం, విమాన ...

Read More »

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరి‌సిల్ల‌ రోడ్‌లో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అఖిల‌ భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల‌మాల‌ వేసి ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు భారతీయ క్రియాశీలి, అమరజీవి అన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస అనే ఆశయాల‌ ...

Read More »

నీటిలో పడి యువకుని మృతి

మోర్తాడ్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలం ధర్మోర గ్రామంలో మంగళవారం నీటిలో మునిగి యువకుడు మృతి చెందినట్లు మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ తెలిపారు. మృతుడు బెస్త కులానికి చెందిన వాడని ఎట్టేటి మహేందర్‌ (36) సోమవారం చేపల‌ కొరకు నీటిలో వల‌వేసి వచ్చాడని తర్వాత మంగళవారం వల‌ తీయడానికి వెళ్ళగా అదే వల‌ చుట్టుకోవడం వ‌ల్ల‌ నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్ల‌లు ఉన్నారన్నారు. శవ పంచానామా నిర్వహించి ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పోలీస్‌ కమీషనర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని టౌన్‌ 4 సమీపంలోని పోలీస్‌ లైన్‌ యందు గల‌ యూనిట్‌ ఆసుపత్రిలో నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా కోవిడ్‌ – 19 సంబంధించిన 2వ టీకా కోవాక్సీన్‌ తీసుకున్నారు. వాక్సిన్‌ వల్లే కరోనాను ఎదుర్కోగల‌మని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పోలీసు ముందుండి పోరాడారని మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎస్‌. సరళ స్పెషల్‌ బ్రాంచ్‌ ...

Read More »

వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ రెండవ డోస్‌ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు 60 సంవత్సరాలు దాటిన, 45 సంవత్సరాల‌ నుండి 59 సంవత్సరాల‌ లోపు డయాబెటిక్‌, బిపి, క్యాన్సర్‌ ఉన్నవారు తప్పకుండా వ్యాక్సినేషన్‌ తీసుకోవాల‌న్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్‌లో ఇవ ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ టీకా ...

Read More »

ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బ వ్యవసాయ మార్కెట్‌ లోగల‌ ఈవీఎం గోదాంలో ఈనెల‌ 15 నుండి 24 వరకు జరుగుతున్న ఇవిఎం ఫిజికల్‌ వెరిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »