Breaking News

డాక్టర్‌ పార్వతికి సన్మానం

డిచ్‌పల్లి, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం హిందీ విభాగంలో విద్యార్థులు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ పార్వతిని బుధవారం సన్మానించారు. సమావేశానికి ఆర్ట్స్‌ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శాంతబాయి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్‌ పార్వతి హిందీ విభాగా వికాసానికి తనవంతు కృషిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

డాక్టర్‌ పార్వతి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థుల‌ కొరకు అవసరమైనన్ని పుస్తకాలు తెప్పిస్తామన్నారు. కార్యక్రమంలో బిఓఎస్‌ డాక్టర్‌ ఎం.డి. జావిద్‌ అహ్మద్‌, పరిశోధక విద్యార్థులు, పిజి విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article