Breaking News

ప్రేమ జంటకు పెళ్లి

నిజామాబాద్‌, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన నరహరి పృథ్వీరాజ్‌, కొండపల్లి రాజమనిలు గత కొన్నేళ్ళుగా ఇష్టపడి, పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటే, వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. కాగా వారిద్దరు ఈనెల‌ 12న ఇంటి నుండి వెళ్ళిపోయి, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్‌ వి.ప్రభాకర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి. మల్లేష్‌ల‌‌ను సంప్రధించారు.

వారు జిల్లా కేంద్రంలో గల‌ బుద్ద విహార్‌ ట్రస్ట్‌లో ఈనెల‌ 13న పెళ్లి కి దరఖాస్తు చేశారు. దాంతో ట్రస్టీ వారు వధూ, వరులు చదువుకున్న సర్టి ఫికెట్ల‌‌ను, ఆదార్‌ కార్డును, వయసు ధృవ పత్రాల‌ను పరిశీలించి బుధవారం ఉదయం 11 గంట‌ల‌కు పెళ్ళి చేసి ప్రేమ జంటను ఒకటి చేశారు.

కార్యక్రమంలో సీపీఐ (ఎం- ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు వి.ప్రభాకర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి. మల్లేష్‌, బి.విఠల్‌, వై.గంగయ్య, అనిత, నాగేష్‌, భాస్కర్‌, శ్రీకాంత్‌, సాయిసుధాకర్‌, ప్రతాప్‌, వరుని తల్లిదండ్రులు సంపత్‌, సరుబాయి పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article