Breaking News

ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలోని ఎంకే గార్డెన్‌లో జిల్లా ముఖ్య సల‌హాదారులు కళ్యాణ్‌ రాజేందర్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన రజక ఐక్యవేదిక బాల్కొండ నియోజకవర్గ బాధ్యుడు యానంపల్లి వినోద్‌ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కన్వీనర్‌ మానస గణేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల‌కు ఇచ్చిన హామీల‌ను వెంటనే అమలు చేయాల‌ని కోరారు.

అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న రజకుల‌ను ఆదుకునేందుకు సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాల‌న్నారు. గత డిసెంబర్ నెల‌ నుండే రజకుల‌కు ఉచిత విద్యుత్ అమలు చేస్తానని సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాల‌న్నారు. జిల్లా అధ్యక్షుడు చింతకుంట శంకర్‌ మాట్లాడుతూ రజకులు తమ హక్కుల‌ సాధన కోసం ఏక తాటిపై ఉండి ఉద్యమించాల‌న్నారు.

కార్యక్రమంలో రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు చింతకుంట శంకర్‌, కార్యదర్శి నరేష్‌, రాష్ట్ర కో కన్వీనర్‌ భరత్‌ చంద్ర మ‌ల్ల‌య్య మహిళా అధ్యక్షురాలు రమాదేవి, బాల్కొండ మండల‌ గౌరవ అధ్యక్షుడు కళ్యాణ్‌ రాజేందర్‌, బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు యాణంపల్లి వినోద్‌ కుమార్‌, ముపకాల్‌ మండల‌ అధ్యక్షుడు ముఖేష్‌, మెండోరా మండల‌ అధ్యక్షుడు గంగాధర్‌, ఆర్మూర్‌ నియోజకవర్గ బాధ్యుడు హనుమంతు, మూడు మండలా ల రజక ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article