Breaking News

చేప పిల్ల‌ల‌ సీడ్‌ వదిలినప్పుడు సరిగా చూసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువుల్లో ఉచిత చేప పిల్ల‌ల‌ సీడ్‌ వేసేటప్పుడు సరైన సంఖ్యలో ఉన్నవో లేవో మత్స్యకారులు చూసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం మోస్రా మండల‌ కేంద్రంలోని మాసాని చెరువును ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మత్స్యకారుల‌తో మాట్లాడుతూ, చెరువుల్లో ఉచిత చేప పిల్ల‌ల‌ సీడ్‌ పంపిణీ ల‌క్ష్యం మేరకు జరుగుతున్నదో లేదో కమిటీ సభ్యులు సరిగా చూసుకోవాల‌ని చూసుకోకుంటే మీరే నష్టపోతారని తెలిపారు. కమిటీలో గ్రామ సర్పంచ్‌, వీఆర్వో, పంచాయతీ సెక్రెటరీలు ఉండాల‌న్నారు. చేపలు వదిలే రోజు ఏ చెరువులో ఎంత సీడ్‌ వదులుతున్నారో కమిటీ మెంబర్స్‌ కు తెలియజేయాల‌ని, ఫొటోస్‌ తీయించాల‌న్నారు.

మాసాని చెరువులో ల‌క్ష 20 వేల‌ సీడ్‌ వేసినట్లు మత్స్యశాఖ సహాయ సంచాల‌కులు తెలిపారు. మత్స్యకారుల‌ సంఘం అధ్యక్షుడు తిలాఫీ అనే రకం చేప నుండి వేరే రకం చేపలు సరిగా అభివృద్ధి చెందడం లేదని కలెక్టర్‌కు తెలిపారు. మండలాల‌ వారిగా చెరువుల‌ వారిగా సీడ్‌ వదలిన ఫిగర్స్‌ కాపీలు సీడ్‌ వేసే వివరాల‌కు సంబంధించిన ఫొటోస్‌ సంబంధిత తహశీల్దార్లకు పంపాల‌ని ఎ.డి. ఫిషరీస్‌ను ఆదేశించారు.

వారు వెరిఫై చేసి రిప్లై ఇస్తారని తెలిపారు. కలెక్టర్‌ వెంట సర్పంచ్‌ సుమల‌త రామిరెడ్డి, ఎడి ఫిషరీస్‌ ఆంజనేయ స్వామి, ఎంపీడీవో భారతి, తహసిల్దార్‌ రజిని, మత్స్యకారుల‌ సంఘం అధ్యక్షుడు నారాయణ, సాయిలు తదితరులు ఉన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article