Breaking News

Daily Archives: March 19, 2021

టీయూ నుంచి తైవాన్‌కు

డిచ్‌పల్లి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ సౌత్‌ వార్డ్‌ స్కార్‌ షిప్‌కు ఎంపికైన తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన విద్యార్థి రాకేష్‌ నరానిని రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ప్రశంసించారు. తైవాన్‌ దేశంలోని నేషనల్‌ డాంగ్‌ వా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లోని కెమిస్ట్రీ విభాగంలో పిహెచ్‌.డి. ప్రొగ్రాంకు ఎంపికైన రాకేష్‌ నరానికి శుక్రవారం ఉదయం రిజిస్ట్రార్‌ తన చాంబర్‌లో పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ...

Read More »

శనివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడవ శనివారం 20వ తేదీ నిజామాబాదు పట్టణంలో అన్ని విద్యుత్‌ ఉపకేంద్రాల‌లో నెల‌వారీ మరమ్మతుల‌ కారణంగా విద్యుత్‌ సరఫరాలో ఉదయం 9 గంటల‌ నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం ఉంటుందని ఏడిఇలు అశోక్‌, తోట రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కావున అంతరాయాన్ని విద్యుత్‌ వినియెగాదారులందరు గమనించి తమకు సహకరించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Read More »

ఏప్రిల్‌ నుండి రెండు ల‌క్షల‌ కూలీలు రావాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 1 నుండి జిల్లా అంతటా ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున జరగాల‌ని ప్రతిరోజు రెండు ల‌క్షల‌ మంది కూలీలు పనుల‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుండి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ అధికారుల‌తో పలు విషయాల‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల‌ చెరువుల‌లో చేప పిల్ల‌లు వదిలినప్పుడు వాటి లెక్క పక్కాగా ...

Read More »

తెలంగాణలో విద్య కార్పొరేట్‌ పరం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో విద్యను కార్పొరేట్‌ పరం చేయడంలో భాగంగానే బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిజామాబాద్‌ జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాల‌యాల‌ నిర్వహణకే సరిపోతుందని వాటి అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాల‌యాల‌ను బలోపేతం ...

Read More »

బి.ఎడ్‌. ఫలితాల‌ విడుదల‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లో గల‌ బి.ఎడ్‌.కోర్సుకు చెందిన మూడవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ పరీక్ష ఫలితాల‌ను రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం తన చాంబర్‌లో శుక్రవారం సాయంత్రం విడుదల‌ చేశారు. కార్యక్రమంలో పరీక్షల‌ నియంత్రణాధికారి డా. పాత నాగరాజు, ఇడిపి సెక్షన్‌ అడిషినల్‌ కంట్రోల‌ర్‌ డా. అథిక్‌ సుల్తాన్‌ ఘోరి, చీఫ్‌ వార్డెన్‌ డా. జమీల్‌ అహ్మద్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఆసీఫ్‌ ఉన్నారు. మొత్తం విద్యార్థులు 1302 మంది పరీక్షలు రాయగా ఉత్తీర్ణత ...

Read More »

నీటి దినోత్సవంలో పాల‌నాధికారి

గాంధారి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి దినోత్సవం సందర్బంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ మొక్కల‌కు నీళ్లు పట్టారు. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ నాటిన మొక్కల‌కు నీళ్లు పట్టారు. అక్కడ రెండు మొక్కల‌ను నాటారు. ప్రకృతి వనంలోని మొక్కల‌ను తిల‌కించారు. మొక్కలు ఏపుగా పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిదంగా గ్రామానికి సమీపంలో కోతుల‌కు ఆహార కేంద్రం ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. మొక్కల‌ను ...

Read More »