Breaking News

Daily Archives: March 20, 2021

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం మోర్తాడ్‌ ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. గ్రామంలోని ఇప్పకుంటలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను గ్రామ సెక్రెటరీ రామకృష్ణతో కలిసి అక్కడ జరుగుతున్న పనుల‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న కూలీల‌ను వారి సమస్యల‌ను అడిగి తెలుసుకున్నారు.

Read More »

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ 22న సర్వ సభ్య సమావేశం ఉంటుందని యంపీడిఓ శ్రీనివాస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌ అధ్యక్షతన మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ యొక్క సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల‌ 22న సోమవారం ఉదయం 11 గంటల‌కు వుంటుందని సమావేశానికి అన్ని శాఖల‌ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాల‌ని ...

Read More »

కామారెడ్డి పట్టణంలో మిషన్‌ భగీరథ నీరు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అన్ని ప్రాంతాల‌కు మిషన్‌ భగీరథ నీటిని అందించే విధంగా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం క్యాంపు కార్యాల‌యంలో మున్సిపల్‌ అధికారుల‌తో మంచినీటి సరఫరాపై సమీక్షిస్తూ పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాల‌ని ఫోన్‌ ద్వారా మిషన్‌ భగీరథ సూపరింటెండింగ్‌ ఇంజనీరును ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, కమిషనర్‌ ...

Read More »

కామారెడ్డి జిల్లాకు అవార్డు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండవ ఎలెట్స్‌ నేషనల్‌ వాటర్‌, శానిటేషన్‌ ఇన్నోవేషన్‌ అవార్డు 2021 జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌కి ప్రకటించారు. కేంద్ర జల‌శక్తి శాఖ, భారత ప్రభుత్వ నేషనల్‌ మిషన్‌ క్లీన్‌ గంగా సమన్వయంతో ఎలెట్స్‌ స్వచ్చంద సంస్థ ఈనెల‌ 18న నిర్వహించిన ఇన్నోవేషన్‌ సమ్మిట్లో అవార్డు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు, జాతీయ ఉపాధి హామీ పనులు చెక్‌ డ్యాముల‌ నిర్మాణం, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలు జిల్లాలో అమలు చేయడం ...

Read More »

జిల్లా అడ్వకేట్‌ సొసైటీ ఎన్నికల‌ అధికారుల‌ నియామకం

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అడ్వకేట్‌ మ్యూచువల్లీ ఏడెడ్‌ కోపరేటివ్‌ సొసైటీ 2021-2022 సంవత్సరానికి నిర్వహించే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ పదవుల‌ ఎన్నిక నిర్వహణ కోసం ఎన్నికల‌ అధికారులుగా న్యాయవాదులు బండారి కృష్ణానంద్‌, మల్లెపూల‌ జగన్‌ మోహన్‌ గౌడ్‌ను నియమిస్తున్నట్లు జిల్లా అడ్వకేట్‌ సొసైటీ అధ్యక్షుడు నీల‌కంఠ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సరాల‌ పదవీకాల‌ డైరెక్టర్‌ (4) పోస్టుల‌తో పాటు గత సంవత్సరం కరోనా కారణంగా వాయిదా పడిన (4) డైరెక్టర్‌ పోస్టుల‌కు ...

Read More »

భక్తుల‌ రద్దీతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట

ఆర్మూర్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచ‌ల‌ క్షేత్రం శనివారం ఉదయం 6 గంటల‌ నుండి దర్శనాల‌ రద్దీ ప్రారంభం అయింది. కరోన తర్వాత రోజు రోజు భక్తుల‌ తాకిడి పెరుగుతూ ఉంది. వేసవికాలం ప్రారంభం కావడంతో శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు జిల్లా నలుమూలల‌ నుండి వచ్చి బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల‌ తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారి ...

Read More »

వంద శాతం ఆస్తిపన్ను వసూలు కావాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 25లోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాల‌ని, లేదంటే సంబంధిత అధికారుల‌పై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ నుండి పంచాయతీ రాజ్‌ శాఖ అధికారుల‌తో ఆస్తి పన్ను వసూలు గ్రామాల్లో పారిశుధ్యం పై సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు కొంత ప్రోగ్రెస్‌ ఉన్నప్పటికీ ఆస్తిపన్ను వసూలులో ఈ నెల‌ 25 చివరి తేదీ నిర్ణయించడం జరిగిందని ...

Read More »