Breaking News

జిల్లా అడ్వకేట్‌ సొసైటీ ఎన్నికల‌ అధికారుల‌ నియామకం

నిజామాబాద్‌, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అడ్వకేట్‌ మ్యూచువల్లీ ఏడెడ్‌ కోపరేటివ్‌ సొసైటీ 2021-2022 సంవత్సరానికి నిర్వహించే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ పదవుల‌ ఎన్నిక నిర్వహణ కోసం ఎన్నికల‌ అధికారులుగా న్యాయవాదులు బండారి కృష్ణానంద్‌, మల్లెపూల‌ జగన్‌ మోహన్‌ గౌడ్‌ను నియమిస్తున్నట్లు జిల్లా అడ్వకేట్‌ సొసైటీ అధ్యక్షుడు నీల‌కంఠ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

మూడు సంవత్సరాల‌ పదవీకాల‌ డైరెక్టర్‌ (4) పోస్టుల‌తో పాటు గత సంవత్సరం కరోనా కారణంగా వాయిదా పడిన (4) డైరెక్టర్‌ పోస్టుల‌కు మొత్తంగా 8 డైరెక్టర్ల పదవి ఎన్నికల‌తో పూర్తిస్థాయి బోర్డ్‌ డైరెక్టర్‌ కార్యవర్గాన్ని ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఏప్రిల్ నెల‌లో జరిగే ఎన్నికల‌ ప్రకటన నియమావళి ఎన్నికల‌ అధికారి ప్రకటిస్తారని పేర్కొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article