Breaking News

కామారెడ్డి పట్టణంలో మిషన్‌ భగీరథ నీరు

కామారెడ్డి, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అన్ని ప్రాంతాల‌కు మిషన్‌ భగీరథ నీటిని అందించే విధంగా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం క్యాంపు కార్యాల‌యంలో మున్సిపల్‌ అధికారుల‌తో మంచినీటి సరఫరాపై సమీక్షిస్తూ పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాల‌ని ఫోన్‌ ద్వారా మిషన్‌ భగీరథ సూపరింటెండింగ్‌ ఇంజనీరును ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, కమిషనర్‌ దేవేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article