అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ పథకాల‌ను చూసి పట్టభద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల‌కు పట్టం కట్టారని మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌ తెలిపారు. పట్టభద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిల‌ను ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సాలూరలొ తెరాస నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు.

బస్టాండ్‌ వద్ద బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచుకొన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు శివకాంత్‌, ఐడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ రాజాగౌడ్‌, ఫతే పూర్‌ సర్పంచ్‌ అమిర్‌, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బి రాజేశ్వర్‌ పటేల్‌, చందూర్‌ సాయిరెడ్డి, తెరాస నాయకులు బుయ్యన్‌ రాజప్ప, మాజీ ఎంపీటీసీ గాండ్ల రాజేశ్వర్‌, సంజీవ్‌ కుమార్‌, స్వామి గౌడ్‌, కేజీ గంగారాం, ఖదీర్‌, ఎల్మా దత్తు, టన్నే పోశెట్టి, గౌరజీ, శ్రీరాం గంగాధర్‌, మాక్లూర్ ల‌క్ష్మణ్‌, కన్నె రమేష్‌, అజిజ్‌, సంగెపు భూమయ్య, సోక్కం సాయులు, అవుటి ల‌స్మన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

జనావాసాల‌ వద్ద మాంసం వ్యర్థాలు

బోధన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ లోని 29వ వార్డులో గల‌ మొచ్చిగల్లీ పక్కన ...

Comment on the article