Breaking News

Daily Archives: March 22, 2021

నిరుద్యోగులు త్వరలోనే గుణపాఠం చెప్పే రోజు వస్తుంది

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల‌ వయోపరిమితిని 58 నుండి 61 సంవత్సరాల‌కు పెంచడం కేసీఆర్‌ యొక్క అవివేకానికి నిదర్శనమని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యోగాలు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటే వయోపరిమితిని పెంచి నిరుద్యోగుల‌ ఆకాంక్షల‌ పైన నీళ్లు చల్లారని వెంటనే పెంచిన వయోపరిమితిని తగ్గించాల‌ని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు. ల‌క్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా మరొకవైపు వయోపరిమితి పెంచడం వ‌ల్ల‌ నిరుద్యోగుల‌ ...

Read More »

రేపటి నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిద్‌ – 19 నిబంధనల‌ను అనుసరించి తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లో గల‌ డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్యప్రణాళికకు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సుల‌కు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూల‌ర్‌ పరీక్షలు మరియు పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సుల‌కు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ ...

Read More »

ప్రజల‌ సహకారంతో నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి – ప్రధాని మోదీ

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి సంరక్షణ లేకుండా అభివృద్ధిని ఊహించలేమని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ జల‌ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జిల్లా కలెక్టర్‌, కేంద్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర జల‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా, కొన్ని రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారుల‌తో సోమవారం ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల‌పై మాట్లాడారు. కేంద్ర జల‌ శక్తి అభియాన్‌లో భాగంగా ప్రధాని ...

Read More »

ముగిసిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

బోధన్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఉదయం 9:30 గంటల‌ నుండి మధ్యాహ్నం 2 గంటల‌ వరకు జరిగాయి. మొత్తం 86 ఓట్లకు గాను, 78 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా వీ.ఆర్‌. దేశాయ్‌ ఎన్నిక కాగా, ఉప అధ్యక్షుగా సయ్యద్‌ అప్సర్‌ పాషా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వరరావ్‌ ఎన్నిక కాగా, సంయుక్త కార్యదర్శిగా సమ్మయ్య ఎన్నికయ్యారు. కోశాధికారిగా వాజీద్‌ హుస్సేన్‌ ఎన్నికయ్యారని ఎన్నికల‌ ...

Read More »

క్లిష్ట పరిస్థితుల్లో రక్తదానం ప్రశంసనీయం

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తగ్గిపోయిన సంగతి తెలుసుకొని ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలో గల్‌ రెడ్‌ క్రాస్‌ భవనంలో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరానికి స్వచ్చందంగా రక్తదాతలు వచ్చి రక్త దానం చేయడం గొప్ప విషయమని ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ ప్రధాన అడ్మిన్‌ నరాల‌ సుధాకర్‌ అన్నారు. కేవలం సోషల్‌ మీడియాలో చూసి సోమవారం పది మంది రక్త దానం చేయడం గొప్ప ...

Read More »