Breaking News

ముగిసిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

బోధన్‌, మార్చ్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఉదయం 9:30 గంటల‌ నుండి మధ్యాహ్నం 2 గంటల‌ వరకు జరిగాయి. మొత్తం 86 ఓట్లకు గాను, 78 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా వీ.ఆర్‌. దేశాయ్‌ ఎన్నిక కాగా, ఉప అధ్యక్షుగా సయ్యద్‌ అప్సర్‌ పాషా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వరరావ్‌ ఎన్నిక కాగా, సంయుక్త కార్యదర్శిగా సమ్మయ్య ఎన్నికయ్యారు. కోశాధికారిగా వాజీద్‌ హుస్సేన్‌ ఎన్నికయ్యారని ఎన్నికల‌ ప్రధాన అధికారి ఆరిఫోద్దీన్‌, సహాయ ఎన్నికల‌ అధికారి ఖాసీం బాషా తెలిపారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article