Breaking News

Daily Archives: March 23, 2021

టెక్నికల్‌ అసిస్టెంట్‌ సస్పెండ్‌

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ నిధుల‌ను అక్రమంగా దుర్వినియోగం చేసినందుకు పెద్ద కొడప్గల్‌ మండలం వడ్లం గ్రామపంచాయతీ ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ సద్యదుల్లాను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ విధుల‌ నుండి సస్పెండ్‌ చేశారు. రైతు వేసుకున్న రోడ్డును ఉపాధి హామీ పనుల్లో వేసినట్లుగా రికార్డ్‌ చేసి, అక్రమంగా బిల్లులు చెల్లింపు చేసినందుకుగాను సస్పెండ్‌ చేయడం జరిగింది.

Read More »

ఆదర్శ పట్టణంగా బాన్సువాడ

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ బడ్జెట్‌ సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. స్వచ్ఛ బాన్సువాడగా మార్చడానికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పాల‌కవర్గం సభ్యులు, అధికారులు కృషి చేయాల‌ని‌ కోరారు. మున్సిపల్‌ నిధుల్లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారు. 2021-22 బడ్జెట్‌కు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ ...

Read More »

నీటి సంరక్షణ పనుల‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షపు నీటిని సంరక్షణ చేసే విధంగా ఊట చెరువులు, చెక్‌ డ్యాములు, కందకాలు ఏర్పాటుచేసి భూగర్భ జలాల‌ పెంపునకు దోహదపడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. తాడువాయి మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల‌కు పనులు కల్పించడానికి నీటి సంరక్షణ పనుల‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించారు. గ్రామాల్లోని శ్రమ శక్తి సంఘాల‌ సభ్యుల‌తో‌ చర్చించి ఉపాధి హామీ అధికారులు ...

Read More »

అత్యంత పారదర్శకంగా బి- టీఎస్‌ పాస్‌ చట్టం

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో ఒకటైన టి ఎస్‌ – బి పాస్‌ ను కూడా చాలా పారదర్శకంగా చట్టం చేశారని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రగతి భవన్‌లో టియస్‌ – బి పాస్‌ చట్టం, బిల్డింగ్‌ పర్మిషన్‌పై మున్సిపల్‌ కమిషనర్‌లు, ఆర్డీవోలు తదితరుల‌తో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజల‌కు సేవ‌లు ఇంకా అందుబాటులో ఉండాల‌నే ఉదేశ్యంతో రెండు ...

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిద్‌ – 19 నిబంధనల‌ను అనుసరించి తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌ల‌లో గ డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్యప్రణాళికకు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సుల‌కు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూల‌ర్‌ పరీక్షలు మరియు పీజీకి సంబంధించిన ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సుల‌కు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి చెప్పుల‌ దండ

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్‌.టి.ఆర్‌ చౌరస్తా వద్ద కే.సీ.ఆర్‌ చిత్ర పటానికి చెప్పుల‌ దండ వేసి పిండ ప్రదానం చేశారు. సిఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల‌కు 30 శాతం పీ.అర్‌.సీ పెంచి, వయో పరిమితిని 61 సంవత్సరాల‌కు పెంచడం వ‌ల్ల‌ యాభై వేల‌ నుండి ల‌క్షల‌ మంది ఉద్యోగులు ఇంకా 3 ...

Read More »

రేపట్నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూళ్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెల‌వులు ప్రకటిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభ వేదికగా ప్రకటన చేశారు. పాఠశాల‌ల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మంత్రి సబిత, విద్యా, వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమై చర్చించారు. పాఠశాల‌లకు సెల‌వులు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది.

Read More »

కెసిఆర్‌ నిర్ణయంతో నిరుద్యోగుల‌కు తీవ్ర అన్యాయం

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల‌ ప్రాంగణంలో విద్యార్థులు నిరుద్యోగుల‌తో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వయోపరిమితి పెంచడం వ‌ల్ల తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు విద్యార్థుల‌కు తీవ్ర అన్యాయం కలుగుతుందని ఇప్పటికే ఉన్నత విద్య చదివినా ఉద్యోగాలు లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన ...

Read More »

ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూతపడింది…

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారంగాపూర్‌ నిజాం కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. షుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాపర్టీ, రెవెన్యూ రికార్డులు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్‌ చేయించాల‌ని ఆర్డీవోను ఆదేశించారు. ఫ్యాక్టరీ డైరెక్టర్లతో మాట్లాడారు. ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూత పడిందో డైరెక్టర్లు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. రైతులు చెరుకు పంట నుండి వేరే పంటకు మారడం, రా మెటీరియల్ ల‌భించకపోవడం కారణం అన్నారు. చెరుకు పండించిన రైతుకు చెరుకు ...

Read More »

సుజాత్‌ అలీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగపు పరిశోధక విద్యార్థి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డిజిపి కార్యాల‌యంలో ప్రజా సంబంధాల‌ నిపుణిడిగా బాధ్యతలు నిర్వర్తించిన సుజాత్‌ అలీకి పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని మాజీ రిజిస్ట్రార్‌, సోషల్‌ సైన్సెస్‌ పీఠాధిపతి, మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఆచార్యులు ప్రొఫెసర్‌ కె. శివశంకర్‌ పర్యవేక్షణలో పరిశోధకులు సుజాత్‌ అలీ ‘‘మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ది లా అండ్‌ ఆర్డర్‌ త్రో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఇన్‌ హైదరాబాద్‌ ...

Read More »

25న ఉజ్బెకిస్తాన్‌కు గుగులోత్‌ సౌమ్య

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిఫా ర్యాంకింగ్‌ కొరకు నిర్వహించనున్న అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొనడానికి భారతదేశం తరఫున ఇందూరు ఎక్స్‌ప్రెస్‌ గూగులోత్‌ సౌమ్య ప్రాతినిధ్యం వహించనుందని, ఏప్రిల్‌ 5 నుండి ప్రారంభం కానున్న మ్యాచ్‌కు సౌమ్య ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమి అధ్యక్షులు నరాల‌ సుధాకర్‌, నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఖలీల్‌, షఖీల్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల‌ 5న ఉజ్బెకిస్తాన్‌ దేశం తో అలాగే ఏప్రిల్‌ ...

Read More »

ప్రతి వర్షపు చుక్క సంరక్షించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ జల‌ దినోత్సవం సందర్భంగా ఈనెల‌ 22 నుండి నవంబర్‌ 30 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల‌లో జల‌శక్తి అభియాన్‌ కింద నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జల‌శక్తి అభియాన్‌, సీజనల్‌ వ్యాధులు, ఆజాదీ కి అమృత మహోత్సవం, టీఎస్‌ ఐపాసు, ఫారెస్ట్‌, రెవిన్యూ ల్యాండ్‌ ...

Read More »