Breaking News

ఆదర్శ పట్టణంగా బాన్సువాడ

కామారెడ్డి, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ బడ్జెట్‌ సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు.

స్వచ్ఛ బాన్సువాడగా మార్చడానికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పాల‌కవర్గం సభ్యులు, అధికారులు కృషి చేయాల‌ని‌ కోరారు. మున్సిపల్‌ నిధుల్లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారు. 2021-22 బడ్జెట్‌కు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ జువెద్‌, కమిషనర్‌ రమేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article