Breaking News

ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూతపడింది…

నిజామాబాద్‌, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారంగాపూర్‌ నిజాం కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. షుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాపర్టీ, రెవెన్యూ రికార్డులు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్‌ చేయించాల‌ని ఆర్డీవోను ఆదేశించారు. ఫ్యాక్టరీ డైరెక్టర్లతో మాట్లాడారు. ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూత పడిందో డైరెక్టర్లు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

రైతులు చెరుకు పంట నుండి వేరే పంటకు మారడం, రా మెటీరియల్ ల‌భించకపోవడం కారణం అన్నారు. చెరుకు పండించిన రైతుకు చెరుకు కట్‌ చేసే లేబర్‌ ప్రాబ్లం వ‌ల్ల‌ లోకల్‌ లేబర్‌ ఎవరు చెరుకు కటింగ్‌కు రాకపోవడం బయటి నుంచి లేబర్‌ రాకపోవడం, లేబర్‌ దొరకక రైతులు వరి పంట వైపు అల‌వాటు అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం చెరుకు కోతకు మిషన్లు వచ్చాయని తెలిపారు.

అంతకుముందు నెహ్రు నగర్‌లో పార్క్‌ పరిశీలించారు. పార్కును శుభ్రం చేయించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామపంచాయతీ నర్సరీలో ఖాళీ బ్యాగుల‌లో విత్తనాలు నాటాల‌ని తెలిపారు. కార్యక్రమంలో బోధన్‌ ఆర్‌డిఓ రాజేశ్వర్‌, షుగర్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article