Breaking News

నీటి సంరక్షణ పనుల‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

కామారెడ్డి, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షపు నీటిని సంరక్షణ చేసే విధంగా ఊట చెరువులు, చెక్‌ డ్యాములు, కందకాలు ఏర్పాటుచేసి భూగర్భ జలాల‌ పెంపునకు దోహదపడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. తాడువాయి మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల‌కు పనులు కల్పించడానికి నీటి సంరక్షణ పనుల‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించారు.

గ్రామాల్లోని శ్రమ శక్తి సంఘాల‌ సభ్యుల‌తో‌ చర్చించి ఉపాధి హామీ అధికారులు పనుల‌ను గుర్తించాల‌ని కోరారు. మార్కెట్లు డిమాండ్‌ ఉన్న పంటల‌ను రైతు సాగు చేసుకునే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాల‌ని కోరారు.

అర్హుల‌కు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాల‌న్నారు. మార్చి 31లోగా బ్యాంకు లింకేజీ రుణాలు 100 శాతం ఇప్పించే విధంగా ఐకేపీ అధికారులు చూడాల‌న్నారు. ఏప్రిల్‌ 15లోగా గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనులు, విద్యుత్‌ సమస్యల‌ను పరిష్కరించాల‌ని సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఎంపీపీ రవి, జెడ్‌పిటిసి సభ్యురాలు రమాదేవి, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, డిపిఓ సాయన్న, ఎంపీడీవో ల‌క్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article