Breaking News

ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిద్‌ – 19 నిబంధనల‌ను అనుసరించి తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌ల‌లో గ డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్యప్రణాళికకు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సుల‌కు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూల‌ర్‌ పరీక్షలు మరియు పీజీకి సంబంధించిన ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సుల‌కు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూల‌ర్‌ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనాయి.

ఉదయం 10 గంటల‌ నుంచి 12 గంటల‌ వరకు జరిగిన డిగ్రీ మూడవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ పరీక్షల్లో మొత్తం 9 వేల‌ 764 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 9 వేల‌ 243 మంది హాజరు, 541 మంది గైర్హాజరు అయ్యారని అధికారులు వెల్ల‌డించారు. పీజీ మూడవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ పరీక్షల్లో మొత్తం 2 వేల‌ 58 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1 వేయి 972 మంది హాజరు, 86 మంది గైర్హాజరు అయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల‌ నుంచి 4 గంటల‌ వరకు జరిగిన డిగ్రీ ఐదవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ పరీక్షల్లో మొత్తం 8 వేల‌ 290 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల‌ 939 మంది హాజరు, 351 మంది గైర్హాజరు అయ్యారన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని యూనివర్సిటీ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. పాత నాగరాజు పర్యవేక్షించారు. వారితో పాటు యూనివర్సిటీ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ డా. వాసం చంద్రశేఖర్‌ తదితర అధ్యాపకులు ఉన్నారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article