Breaking News

చెరువులో గుర్తు తెలియని మృతదేహం

ఆర్మూర్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మధ్యాహ్నం బోర్గాం (కె) గ్రామ పరిధిలో గ ముసలి కుంట్ల చెరువులో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతుండగా గ్రామ విఆర్‌ఏ గుర్తించి మాక్లూర్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మాక్లూర్‌ ఎస్‌ఐ రాజారెడ్డి చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని తీసి పరిశీలించి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్‌ ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ యందు తెలియజేయాల‌న్నారు. మృతుడి వయస్సు 30-35 సంవత్సరాలు, బూడిద రంగు ప్యాంటు మాత్రమే ధరించి వున్నాడు.

Check Also

ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా చిలుక కిష్టయ్య

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుగా ఎన్నికైన చిలుక కిష్టయ్యని ...

Comment on the article