Breaking News

Daily Archives: March 25, 2021

వేలం ద్వారా ల‌క్షల‌ ఆదాయం

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు స్టేషన్‌లో పనిచేయని జనరేటర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, ఎల‌క్ట్రానిక్‌, ఫర్నీచర్‌, ఇతర సామాగ్రిని గురువారం వేలం వేసినట్టు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డిఎస్‌పి ఉదయకృష్ణ తెలిపారు. కాగా వీటి ద్వారా రూ. 2 ల‌క్షల‌ 65 వేల‌ 500 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. జిల్లా పోలీసు హెడ్‌ క్వాటర్స్‌ కార్యాల‌యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. డిపివో ఏవో జగపతిరాజు, స్టోర్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ నరసింహరావు, కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ ...

Read More »

మొక్కలు వందశాతం బతికేలా చూడాలి

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌లో పల్లె ప్రకృతి వనంను గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. మొక్కల‌ చుట్టూ పాదులు పెద్దగా చేయాల‌ని సూచించారు. ట్యాంకర్‌ ద్వారా మొక్కల‌కు నీటిని అందించాల‌ని కోరారు. నాటిన మొక్కలు 100 శాతం బతికే విధంగా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవితేజ గౌడ్‌, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, డిపిఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Read More »

అల‌సత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంపోస్టు షెడ్ల ద్వారా సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. రామారెడ్డి మండల‌ కేంద్రంలోని రైతు వేదికలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా తడి, పొడి చెత్త వేరుగా సేకరించి కంపోస్టు షెడ్డుకు తరలించే విధంగా చూడాల‌న్నారు. అన్నీ కంపోస్ట్‌ షెడ్లు వాడుకలోకి తీసుకురావాల‌ని సూచించారు. పల్లె ప్రకృతి వనాల‌లో నాటిన మొక్కల‌కు ...

Read More »

ఆర్మూర్‌లో లెక్చరర్ల ధర్నా

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పేరుతో అకస్మాత్తుగా విద్యా సంస్థల‌ను మూసివేసి ప్రైవేట్‌ లెక్చరర్ల జీవితాల‌ను రోడ్డు పాలు జేసిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్మూర్‌ ప్రైవేట్‌ అధ్యాపకులు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యా నగర్‌ నుండి అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా ఆర్డీవో కార్యాల‌యం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాల‌యం ఎదుట ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లెక్చరర్ల సంఘం నాయకులు శ్రీనివాస్‌, నరేష్‌ మాట్లాడుతూ ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ మూలంగా అతలాకుతలం అయిన ...

Read More »

విద్యాసంస్థల‌ మూసివేత ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సమయంలో విద్యావ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, కరోనా అనంతరం గతనెల‌లో విద్యా సంస్థల‌ను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా కోలుకోలేదని పీ.డీ.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న అన్నారు. ఈ మేరకు ప్రగతిశీల‌ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యూ) ఆధ్వర్యంలో గురువారం విలేకరుల‌తో మాట్లాడారు. ఇటువంటి సమయంలో కరోనా రెండోసారి విజృంభిస్తుందనే కుంటిసాకుతో విద్యా సంస్థల‌కు సెల‌వు ప్రకటించడం విద్యా వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టడానికేనని ఆరోపించారు. ఇదంతా రాష్ట్ర ...

Read More »

రేపు భారత్‌ బంద్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల‌ను మరియు జాతీయ విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాల‌ని డిల్లీలో రైతులు 118 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా మోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఏఐకెఎస్‌సిసి భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం ఆర్మూర్‌ పట్టణంలో వామపక్షాల‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంగడి బజార్‌ నుండి గోల్‌ బంగ్లా పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌, మామిడి పల్లి చౌరస్తా, పెర్కిట్‌, మామిడిపల్లి, తిరుగుతూ భారత్‌ బంద్‌ ...

Read More »

అరెస్టుల‌తో ఉద్యమాల‌ను ఆపలేరు…

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన వయోపరిమితిని తగ్గించాల‌ని డిమాండ్‌ చేస్తూ గురువారం చలో అసెంబ్లీకి బయల్దేరిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌, తెలంగాణ జన సమితి యువజన విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు స్వామిల‌ను గురువారం కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల‌ వయోపరిమితిని ...

Read More »

మహిళా నాయకుల‌ హౌస్‌ అరెస్ట్‌…

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాల‌ విషయంలో ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించ తల‌పెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా కామారెడ్డి జిల్లా నాయకురాళ్లు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దత్తేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కౌన్సిల‌ర్‌ సుజిత భరత్‌, పట్టణ అధ్యక్షురాలు విశ్వనాథుల‌ అనిత, జిల్లా నాయకురాలు బాల‌మనిల‌ను కామారెడ్డి పట్టణ పోలీసులు ఉదయం 6 గంటల‌కు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ...

Read More »