Breaking News

మొక్కలు వందశాతం బతికేలా చూడాలి

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌లో పల్లె ప్రకృతి వనంను గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. మొక్కల‌ చుట్టూ పాదులు పెద్దగా చేయాల‌ని సూచించారు. ట్యాంకర్‌ ద్వారా మొక్కల‌కు నీటిని అందించాల‌ని కోరారు.

నాటిన మొక్కలు 100 శాతం బతికే విధంగా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవితేజ గౌడ్‌, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, డిపిఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article