Breaking News

ఐదుగురికి కరోన పాజిటివ్‌

నిజాంసాగర్‌, మార్చ్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జవహర్‌ నవోదయ విద్యాల‌యంలో ముగ్గురికి, తుంకి పల్లి తండాలో ఒకరికి, కోనతండాలో ఒకరికి, మొత్తం ఐదు కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు మండల‌ వైద్య అధికారి రాధా కిషన్‌ తెలిపారు.

నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 51 మందికి ర్యాపిడ్‌ టెస్టు చేయగా అందులో నలుగురికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, అలాగే కోన తండాకు చెందిన ఒకరికి బాన్సువాడలో ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ తెలిపారు. ప్రజలందరూ తప్పకుండా మాస్క్‌ ధరించి సామాజిక దూరం పాటించాల‌న్నారు. చేతుల‌ను శానిటైజర్‌తో, సబ్బుతో శుభ్రపరచుకోవాల‌న్నారు.

Check Also

కోటగిరిలో కోవిడ్‌ నిబంధనల‌పై అవగాహన

బాన్సువాడ, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రచ్చగల్లి, చావిడి గల్లి, ...

Comment on the article