Breaking News

ప్రతిరోజు వ్యాక్సినేషన్‌ రిపోర్టు సమర్పించాలి

కామారెడ్డి, మార్చ్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాక్సినేషన్‌ ఎక్కువగా జరిగితే పాజిటివ్‌ రేటు తగ్గుతుందని, ప్రభుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించిన వారికి కోవిద్‌ వాక్సినేషన్‌ వంద శాతం జరుగాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం జనహిత భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించిన వారికి ఆశా, ఎఎస్‌ఎం, అంగన్‌ వాడీ సిబ్బంది సహకారంతో ప్రతి ఆరోగ్య కేంద్రంలో వంద మందికి పైగా వాక్సినేషన్‌ జరిగేలా చూడాల‌ని, వాక్సినేషన్‌ కోసం అవగాహన కల్పించాల‌ని, ఏ రోజు ఎవరికి అనేది యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం వంద శాతం ల‌క్ష్య సాధన జరగాల‌న్నారు. ప్రతి రోజూ వాక్సినేషన్‌ రిపోర్టు సమర్పించాల‌ని వైద్య అధికారుల‌ను ఆదేశించారు.

బాన్సువాడ, దోమకొండ మండలాలు పురోగతి సాధించాల‌ని, బికనూర్‌ మండలం, రాజంపేట మండలాలు పురోగతిలో వున్నాయని, వాక్సినేషన్‌ ఎక్కువ సాధిస్తే పాజిటివ్‌ రేటు తగ్గుతుందని తెలిపారు. జిల్లా సరిహద్దు మదునూర్‌ చెక్‌ పోస్టు వద్ద పరీక్షలు ఎక్కవగా నిర్వహించాల‌ని, కిట్స్‌ అందుబాటులో వుంచుకోవాల‌ని, ప్రైమరీ కాంటాక్టును గుర్తించి పరీక్షలు నిర్వహించాల‌ని తెలిపారు. హెల్త్‌ ఇండికేటర్స్‌ సమీక్షిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం పైగా ప్రసవాలు జరుగాల‌ని, నిర్దేశించిన సమయాల‌లో గర్భిణీ పరీక్షలు నిర్వహించాల‌ని, పౌష్టికాహారం, ఆర్థిక సహాయం పక్కాగా అందించాల‌ని, హైరిస్క్‌ కేసుల‌ పట్ల జాగ్ర‌త చర్యలు చేపట్టాల‌ని, కెసిఆర్‌ కిట్స్‌ వెంటనే అందించాల‌ని ఆదేశించారు.

ఎంసి రిజిస్ట్రేషన్స్‌, అంగన్‌వాడీ డే పక్కాగా నిర్వహించాల‌ని సిడిపిఓ, అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్లను ఆదేశించారు. క్షయ వ్యాధిగ్రస్థుల‌ గుర్తింపు, మందులు, ఆర్థిక సహాయం పట్ల వెంటనే చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ చందశేఖర్‌, ప్రభుత్వ ఆసుపత్రి కోఆర్డినేటరు డాక్టర్‌ అజయ్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి అనూరాధ, పిహెచ్‌సి, సిఎసి మెడికల్‌ ఆఫీసర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, సిడిపిఓలు, అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్లు పాల్గొన్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article